»   » పట్టించుకోకుండా ఉండి ఉంటే పాపులరయ్యేది కాదు: బీప్ సాంగ్‌పై స్నేహ

పట్టించుకోకుండా ఉండి ఉంటే పాపులరయ్యేది కాదు: బీప్ సాంగ్‌పై స్నేహ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: బీప్ సాంగ్‌పై ప్రముఖ నటి స్నేహ తనదైన శైలిలో స్పందించారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమెను మీడియా ప్రతినిధులు బీప్ సాంగ్‌పై ప్రశ్నించారు. అమ్మాయిలను పొగిడే పాటులుంటాయి... తిడుతూ రాసిన పాటలూ ఉన్నాయని, ఈ విషయంలో మనమేమీ చేయలేమని అన్నారు.

ఒక పాట గురించి పదే పదే మాట్లాడి మనమే పాపులర్ చేస్తున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. తాను బీప్ సాంగ్ వినలేదని, అంతలా ఆ పాటలో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి తనకు కలుగుతోందని, ఇదే ఆ పాటను హిట్ చేసిందని ఆమె అన్నారు.

Sneha says the beep song should be ignored

పాటలో తప్పుందని తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడడం, ప్రశ్నలు వేయడం అనవసరమని, అసలు పట్టించుకోకుండా ఉండి ఉంటే ఇత రాద్ధాంతం అయ్యేది కాదని అన్నారు. మీడియానే బీప్ సాంగ్‌కు పబ్లిసిటీ ఇచ్చిందని అన్నారు.

ఒక స్త్రీగా మాత్రం ఇటువంటి పాటలను తాను ఖండిస్తానని, పిల్లలు కూడా ఈ పాట వింటున్నారని, ఇది వారిపై ప్రభావం చూపుతుందని అంటూ సమాజానికి ఉపయోగపడే పాటలు పాడాలని ఆమె సలహా ఇచ్చారు.

English summary
Actress Sneha said that the beep song should have been ignored.
Please Wait while comments are loading...