For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెడిషనల్ కాదమ్మా!.. పిచ్చ హాట్ ఇక్కడ: ఫిగర్‌తో పిచ్చెక్కించేసిన స్నేహా

  |

  సినిమా ఇండస్ట్రీలో అవకాశాలనేవి కేవలం టాలెంట్ మీద ఆధారపడి ఉండవు. టాలెంటే నిజంగా కొలమానం అయితే ఉదయభాను లాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ యాంకర్స్ గానే మిగిలిపోయేవారు కాదు.

  సరే ఆమె సంగతి పక్కనపెడితే.. జూనియర్ ఐశ్వర్యగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన కళ్లతోనే ఎంతోమందిని కట్టిపడేసిన స్నేహా ఉల్లాల్ కూడా ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాల్సి రావడం.. టాలెంట్ లేకపోవడమా?.. అవకాశాలు రాకపోవడమా?..

  మొత్తానికి మూడేళ్లకు గానీ అదృష్టం మళ్లీ స్నేహా ఉల్లాల్ తలుపు తట్టలేదు. ఆయుష్మాన్ భవ చిత్రం ద్వారా తెలుగు తెరపై మరోసారి ఆమె మెరవనున్నారు. అయితే ఈ సారి ఎంట్రీ మాత్రం 'పిచ్చ పోష్‌' అని చెబుతున్నారు..

   స్నేహా.. రూట్ మార్చిందా?

  స్నేహా.. రూట్ మార్చిందా?

  ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా, నేను మీకు తెలుసా వంటి చిత్రాల్లో స్నేహా ఉల్లాల్ ట్రెడిషనల్ గానే కనిపించారు. పాటల్లో తప్ప పెద్దగా గ్లామర్ ఎక్స్ పోజింగ్ ఎక్కడా ఉండదు. కానీ ఈసారి స్నేహా ఉల్లాల్ రూటు మార్చినట్లే కనిపిస్తున్నారు.

   పిచ్చ పోష్:

  పిచ్చ పోష్:

  తాజాగా రిలీజ్ అయిన ఆయుష్మాన్ భవ పోస్టర్ చూస్తుంటే.. సినిమాలో స్నేహా ఉల్లాల్ గ్లామర్ డోస్ పెంచినట్లుగానే కనిపిస్తోంది. నేడు స్నేహా ఉల్లాల్ పుట్టిన రోజు కావడంతో ఈ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ తోనే హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో తెలిసేలా ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు. 'వైశాలి అంటే ట్రెడిషనల్‌ అనుకుంటున్నారా..? పిచ్చ పోష్‌! ఫిగర్‌ అదరిపోద్ది' అని పోస్టర్‌పై రాసి ఉండటం విశేషం.

   కొత్త స్నేహా ఉల్లాల్ కనిపిస్తుందట..

  కొత్త స్నేహా ఉల్లాల్ కనిపిస్తుందట..

  ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అయితే పాత్ర పరంగా మాత్రం స్నేహా ఉల్లాల్ ఓ భిన్నమైన.. వైవిధ్య భరితమైన పాత్రలో నటిస్తున్నట్లు చెబుతున్నారు.

  వైశాలి పాత్రలో ధైర్యసాహసాలు కలబోసిన యువతి పాత్రలో తాను నటిస్తున్నానని, లుక్స్ పరంగా వినూత్నంగా కనిపిస్తానని స్నేహా ఉల్లాల్ తెలిపారు.

   డైరెక్టర్ ఎవరు?:

  డైరెక్టర్ ఎవరు?:

  వైశాలి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కానీ సినిమాకు సంబంధించి దానిపై ఎటువంటి వివరాలు లేవు. దీంతో సినిమాకు దర్శకుడెవరు? అన్నది కూడా తెలియరాలేదు. అయితే ఈ ఏడాది 'నేను లోకల్' సినిమా ద్వారా హిట్ అందుకున్న త్రినాథరావు నక్కిన స్నేహా ఉల్లాల్ తాజా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.

  ఇదే విషయమై కొన్ని మీడియా సంస్థలు ఆయన్ను సంప్రదించగా.. అలాంటిదేమి లేదని ఆయన స్పష్టం చేశారట. ఈ సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హీరో రామ్‌తో ప్రేమ కథా నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపారట. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

   స్నేహా ఉల్లాల్‌పై రూమర్స్:

  స్నేహా ఉల్లాల్‌పై రూమర్స్:

  స్నేహా ఉల్లాల్ విషయానికొస్తే.. ఆమె గత కొంతకాలంగా 'ఆటో ఇమ్యూన్ డిసీజ్‌'తో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వ్యాధి తీవ్రత ఎక్కువైందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

  ఓవైపు తెలుగులో ఓ సినిమాతో ఆమె బిజీగా ఉన్న సమయంలో.. ఇలాంటి వార్తలు రావడం గందరగోళానికి గురిచేస్తోంది. ఆమె నిజంగా అనారోగ్యంగా ఉంటే.. సినిమా షూటింగ్స్ కు ఎలా హాజరవుతున్నారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాబట్టి ఇందులో నిజానిజాలేంటో స్నేహా ఉల్లాల్ స్పందిస్తే గానీ తెలియదు.

  English summary
  As it is, her birthday today, the makers of her next film launched her look from the movie. She is playing Vaishali in her next film and the poster is catching instant attention from everyone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X