»   » నమ్మినవాళ్లే మోసం చేశారు..స్నేహా ఉల్లాల్

నమ్మినవాళ్లే మోసం చేశారు..స్నేహా ఉల్లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనని చాలామంది తప్పుదోవ పట్టించారని, నమ్మినవాళ్లే మోసం చేశారని స్నేహా ఉల్లాల్ ఆరోపిస్తోంది. అయితే ఈ మోసం అనేది తెలుగు పరిశ్రమలో జరగలేదని, హిందీ చిత్ర పరిశ్రమలోనేనని చెప్తోంది. అలాగని ఏ రకమైన మోసమో చెప్పటానికి మాత్రం ఆమె ఇష్టపడటం లేదు. అయితే అది ఆమెలేటెస్ట్ బాలీవుడ్ రిలీజ్ 'క్లిక్‌' గురించేనన్నది మాత్రం సుస్పష్టం. చాలా గ్యాప్‌ తర్వాత 'క్లిక్‌' అనే హిందీ చిత్రంలో చేసానని అయితే అది ఇన్నాళ్ళకు రిలీజ్ అవుతుందని ఊహించలేదని చెప్తోంది. 'క్లిక్‌' చిత్రం తన చుట్టూ తిరగదని, ఆ పాత్ర తనకు కరెక్ట్‌ కాదని స్నేహా ఉల్లాల్‌ పేర్కొన్నారు. ఇక తెలుగు పరిశ్రమ అలా కాదని చెబుతూ.. తెలుగులో నాకు మంచి ఆదరణ లభించింది. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' తర్వాత నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాకు బాలీవుడ్‌కన్నా నాకు టాలీవుడ్డే బెటర్‌ అనిపిస్తోంది' అంటోంది స్నేహా ఉల్లాల్‌. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ సరసన సింహా చిత్రంలో చేస్తోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu