»   » గన్ పట్టి హిట్ కొడతానంటోంది

గన్ పట్టి హిట్ కొడతానంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లరి నరేష్ తో యాక్షన్ 3డిలో కనిపించి తర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్. ఆమె త్వరలో గ్యాంగస్టర్ గా కనిపించనుంది. అయితే అదో హిందీ సినిమా. ఆ సినిమా పేరు బబ్లు. అర్షద్ వార్శికి జంటగా ఆమె కనిపించనుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ని బేక్ చేసుకుని రాసిన బయోపిక్ ఆధారంగా రూపొందుతోంది. ఆ బయోపిక్..బబ్లూ శ్రీవాత్సవ అనే గ్యాంగస్టర్ ది.

ఈ విషయమై స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ..."నేను ఈ సినిమాలో చేస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాను. ఈ సినిమాలో నేనో గ్యాంగస్టర్ గా కనిపిస్తాను. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ డ్రామా. సినిమా వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు అదరకొడతాయి. షూటింగ్ ఎప్పుడు మొదలువుతుందా అని ఎదురుచూస్తున్నాను ," అంటూ చెప్పుకొచ్చింది స్నేహ ఉల్లాల్.

Sneha Ullal turns a gangster

తెలుగు చిత్ర పరిశ్రమ లో మొదటి సినిమాతోనే మంచి పేరు రావడంతో ఎగిరి గంతేసిన స్నేహ ఉల్లాల్ కు..ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి..అందులో భాగంగానే బాలకృష్ణ సరసన సింహా లో బంపర్ ఆఫర్ కొట్టేసింది..సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తన దశ తిరుగుతుందని భావించినా అమ్మడికి ఆపర్లు మాత్రం అంతగా రాలేదు..తెలుగులో చివరగా నరేశ్ సరసన యాక్షన్ త్రీడిలో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ పై పోకస్ పెట్టిందట.

English summary
Actress Sneha Ullal has been roped in to play a gangster in an upcoming Hindi film, Bablu. She is paired opposite Arshad Warsi in the film touted to be a biopic of UP (Uttar Pradesh) based gangster Babloo Shrivastava.
Please Wait while comments are loading...