»   » పుకార్లు నిజమైన‌వేళ, కూతురొచ్చిన వేళ.... శోభన్ బాబు-జయలలిత లవ్ స్టోరీ రివైండ్!

పుకార్లు నిజమైన‌వేళ, కూతురొచ్చిన వేళ.... శోభన్ బాబు-జయలలిత లవ్ స్టోరీ రివైండ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న నటుడు నటుడు శోభన్ బాబు. మాజీ సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఆయన అనుబంధం గురించి ఎవరూ మరిచిపోలేరు. వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని, అంతకు మించిన సంబంధం వీరి మధ్య సాగిందని, ఇద్దరూ కొంతకాలం ప్రేమలో మునిగి తేలారని అప్పట్లో రకరకాలుగా చర్చించుకున్నారు.

అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో శోభన్ బాబును మించిన అందగాడు లేడు. ఆ రోజుల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. ఎంతో మంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్రలేకుండా చేశాడు. అలాంటి సోగ్గాడికే నిద్రలేకుండా చేసింది జయలలిత.

అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకు ఏదో తెలియని వ్యామోహం ఉండేది. ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడని అంటుంటారు.

మొదట్లో నిరాకరణే

మొదట్లో నిరాకరణే

జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో.... అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓసినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత వెయ్యిరూపాయల అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారట.

తపించిన శోభన్ బాబు

తపించిన శోభన్ బాబు

ఓ సందర్భంలో శోభన్ బాబు... జయలలిత గురించి మాట్లాడుతూ ‘అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను. అప్పటికి నేను ఆమెను చూడలేదు. ఆమెను చూడాలని తపించాను. తపించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి. ఆమెతో నటిస్తున్నానని కనిపించని వారికి కూడా చెప్పుకున్నాను. కానీ ఆమె సినిమా అని చెప్పి నిర్మాత కనిపించకుండా పోయాడు. తర్వాత ఏనిమిదేళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చింది అని శోభన్ బాబు గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

డాక్టర్ బాబు మూవీతో జయలలితతో

డాక్టర్ బాబు మూవీతో జయలలితతో

‘డాక్టర్‌ బాబు' ఈ సినిమాకు శోభన్‌బాబు ఖరారైనా హీరోయిన్‌ ఖరారుకాలేదు. సినీ పత్రికలో జయలలిత ఫొటో చూసిన శోభన్ బాబు నిర్మాతకు ఫోన్‌ చేసి జయలలితను తీసుకోవాలని సూచించారట. జయ కూడా అందుకు అంగీకరించింది. అలా తొలిసారి 1973లో జయలలితను కలిశారు శోభన్‌బాబు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

శోభన్ బాబుతో చాలా క్లోజ్ అవ్వడానికి కారణం

శోభన్ బాబుతో చాలా క్లోజ్ అవ్వడానికి కారణం

జయలలిత తల్లిని కోల్పోయాక ఒంటరితనం ఫీలయ్యేది. ఈ క్రమంలో శోభన్ బాబుతో పరిచయం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శోభన్ బాబు సెన్సాఫ్ హ్యూమర్ జయను మరింత ఆకర్షించింది. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటిరిదానిలా బతుకుతున్నా నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్లు ఓసారి శోభన్ బాబు తెలిపారు.

పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ...

పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ...

డాక్టర్ బాబు సినిమా దగ్గర నుండే వారిద్దరి ప్రేమ చిగురించిందన అంటుంటారు. తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరిందని, ఒక దశలో జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని భావించారని, అప్పటికే పెళ్ళైన శోభన్ బాబు ఆమెని రెండో భార్యగా చేసుకోవడానికి అంగీకరించారని టాక్. అయితే అప్పట్లో వాళ్ళకి ఒక పాప కూడా పుట్టినట్లు పుకార్లు వచ్చాయి.

ఆ పుకార్లు ఇపుడు నిజమయ్యాయి

ఆ పుకార్లు ఇపుడు నిజమయ్యాయి

అప్పుడెప్పుడో వినిపించిన రూమర్లు ఇపుడు నిజం అయ్యాయి. జయలలిత-శోభన్ బాబు ప్రేమకు ప్రతిరూపాన్ని నేనే అంటూ అమృత అనే మహిళ తెరపైకి వచ్చింది. కావాలంటే తనకు డీఎన్ఏ పరీక్ష చేయించుకోండి అంటూ అమృత పేర్కొనడం ఇపుడు తమిళనాడులో, సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ప్రధాని, రాష్ట్రపతికి లేఖ

ప్రధాని, రాష్ట్రపతికి లేఖ

తన కన్నతల్లిది సహజ మరణం కాదని, నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌లకు ఆమె రాసినట్లు తెలుస్తోంది. జయలలిత రక్తం పంచుకుని పుట్టిన కూతురును నేనే అని, శోభన్ బాబు తన తండ్రి అని, వారు ప్రేమలో ఉన్నపుడు తాను పుట్టానని, వివిధ కారణాల వల్ల వారు వివాహం చేసుకోలేదని. దీంతో నన్ను జయ సోదరి శైలజ, భర్త సారథిలకు అప్పగించారని. నేను ఎవరన్న విషయం ఎవరికీ చెప్పొద్దని వారితో ఒట్టు వేయించుకున్నారని, 1996లో శైలజ సూచన మేరకు జయను కలిస్తే వివరాలు తెలుకుని నన్ను ఒక్కసారిగా హత్తుకున్నారని. ఆమె నా తల్లి అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ చెప్పలేదని'' అని లేఖలో పేర్కొన్నారు.

అసలు వారసురాలిని నేనే

అసలు వారసురాలిని నేనే

జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు మీడియా ముందుకొచ్చి తామే జయ వారసులమని చెప్పడం తనను బాధించందన్నారు. తన తల్లి మరణం వెనక శశికళ, నటరాజన్‌ల పాత్ర ఉందని, ఈ విషయంలో నిజాలు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అమృత లేఖ ఇపుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఎలా దూరం అయ్యారు?

ఎలా దూరం అయ్యారు?

కాగా.... శోభన్ బాబు-జయలలిత దూరం కావడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన విబేధాలే. ఇద్దరికీ ఓ పాప పుట్టినట్లు రూమర్స్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విబేధాలు వచ్చాయని.... శోభన్ బాబుకుకు దూరమైన జయని ఎంజీఆర్ చేరదీశారని అంటుంటారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయ ఎంజీఆర్ కు దగ్గరైందని, శోభన్ బాబును పూర్తిగా మరిచిపోయిందని టాక్. ఎంజీఆర్ తర్వాత జయ రాజకీయంగా, సీఎంగా ఎదిగిన సంగతి తెలిసిందే.

English summary
During her movie career, Jayalalitha fell in love with already married actor Shoban Babu. She was caught watching him through binoculars from her residence. Great love it was, but she never got married!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X