»   » హీరోయిన్ నుంచి పావ్ బాజీ బండి దాకా... ఏమైందీ??

హీరోయిన్ నుంచి పావ్ బాజీ బండి దాకా... ఏమైందీ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

శోభిత ధూళిపాళ అచ్చ తెలుగమ్మాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగమ్మాయిలు తెలుగు సినిమాల్లో పనికిరారనే మాట ఎలాగూ ఉంది. అందుకే ఈమె బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. అనురాగ్ కశ్యప్ లాంటి పెద్ద దర్శకుడిని మెప్పించి.. 'రమణ్‌రాఘవ్ 2.0'లో అవకాశం దక్కించుకున్న శోభిత.. ఆ సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ పక్కన ఆమెకు హీరోయిన్‌గా అవకాశం దక్కిందని చర్చించుకుంటోంది బాలీవుడ్.

ఈమధ్య జాకీచాన్ ఇండియన్ హీరోయిన్ల మీద బాగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. మల్లికా శరావత్‌తో 'ది మిత్' సినిమా చేసిన జాకీ.. తాజాగా 'కుంగ్ ఫూ యోగా'లో దిశాపటాని.. అమైరా దస్తూర్‌లతో జతకట్టాడు. దీని తర్వాత జాకీ చేయబోయే కొత్త సినిమాకు కూడా ఇండియన్ హీరోయిన్‌నే కోరుకున్నాడట. ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్లు శోభితతోపాటు తిలోత్తమ అనే మరో అమ్మాయిని కూడా ఆడిషన్ చేయగా.. శోభితనే ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు సమాచారం. ఆమెకే ఈ సినిమాలో అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్‌తో నటిస్తే శోభిత కెరీరే మారిపోవడం ఖాయం.

ఫోటో పోస్ట్ చేసింది:

ఫోటో పోస్ట్ చేసింది:

ఇప్పటికే అనురాగ్ కశ్యప్ మూవీ రమన్ రాఘవ్ 2.0లో నటించి సక్సెస్ కొట్టడమే కాదు.. మొత్తం మూడు సినిమాల డీల్ సైన్ చేసింది కూడా. ఇంత రేంజ్ ఉన్న శోభితా.. సడెన్ గా ఓ టాప్ క్లాస్ జోక్ పేల్చింది. రీసెంట్ గా ఫేస్ బుక్ లో లో ఈ బ్యూటీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. అందులో ఈమె ఓ రోడ్ సైడ్ స్టాల్ లో పావ్ భాజీ వేస్తోంది.

 తేడా వస్తే పావ్ భాజీ బండి:

తేడా వస్తే పావ్ భాజీ బండి:

తినడానికి వెళ్లినపుడు ఏదో సరదాగా ట్రై చేసి ఉంటుందిలే అని సరిపెట్టుకుందామంటే.. అసలు అప్పుడు వేసింది ఒక పంచ్. ఏకంగా కెరీర్ బ్యాకప్ అనేసింది ఈ మిస్ ఇండియా. సినిమాల్లో తేడా వస్తే పావ్ భాజీ బండి నడుపుకోవచ్చని ప్రాక్టీస్ చేస్తున్నా అన్నది అన్నది మేడం గారి ఉద్దేశ్యం అన్న మాట..

మిస్ ఎర్త్ ఇండియా:

మిస్ ఎర్త్ ఇండియా:

ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాకు కూడా సైన్ చేసింది. అడివి శేష్ హీరోగా రూపొందే ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శోభిత ధూళిపాళ.. టాలీవుడ్ అరంగేట్రంపై తెగ ఖుషీ అయిపోతోంది.2013లో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈమె ఎన్నాళ్లగానో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టాలని చూస్తోంది.

గూడాచారి:

గూడాచారి:

ఇన్నాళ్లకు ఆమె ఆశ ఫలించి అడవి శేష్ హీరోగా చేస్తున్న ‘గూడాచారి' చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతోంది. శోభిత ఇప్పటికేబాలీవుడ్ లో ‘రమణ్ రాఘవ 2.0' చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించింది. గూడాచారి ఈ చిత్రానికి రాహుల్ పాకాల, శశి కిరణ్ లు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు..

భ‌లే ఛాన్స్:

భ‌లే ఛాన్స్:

ఈ మూవీని అభిషేక్ పిక్షర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మను హీరోయిన్ గా అనుకోగా తరువాత ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ శోభిత కు దక్కింది. మొత్తానికి ఈ హాట్ మోడ‌ల్ భ‌లే ఛాన్స్ కొట్టేసింది..వయా బాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ కి వస్తున్న ఈ అందాల పాప టాలీవుడ్ లో కూదా దూసుకు పోవాలని చూస్తోంది.

బ్రైడల్ వీక్ కోసం:

బ్రైడల్ వీక్ కోసం:

ప్రస్తుతం మోడలింగ్ ఆఫర్స్ ఉన్నాయి. మన టాలీవుడ్ సహా మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.చివరగా శోభిత మాట్లాడుతూ.... ఇటీవలే ఇండియా బ్రైడల్ వీక్ కోసం ర్యాంప్‌వాక్ చేశాను. వచ్చిన మంచి ఆఫర్స్ మిస్సవ్వకుండా అదే సమయంలో కీలక దశలో ఉన్న చదువు దెబ్బతినకుండా ప్లాన్ చేసుకుంటున్నాను. స్ఫూర్తి గ్లామర్ రంగంలో రాణిస్తున్న ప్రతి ఒక్కరిలో గ్రేస్ ఉంటుంది. అంత తేలికగా ఎవరూ ఈ రంగంలో ఉన్నత స్థాయికి రాలేరు. అందుకే ఒక్కొక్కరిలో ఉన్న ఒక్కో మంచి పాయింట్‌ని నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నాను అంది.

English summary
miss eart indi shobita dhulipala posted a pic in her Face Book accunt while preparing pav bhaji and says Career Backup
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu