»   » "శివుడి కన్నతల్లిని" అని చెప్పి పెళ్ళి చేసుకుంది .... సోఫియాహయాత్ వెడ్డింగ్ (ఫొటోలు)

"శివుడి కన్నతల్లిని" అని చెప్పి పెళ్ళి చేసుకుంది .... సోఫియాహయాత్ వెడ్డింగ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోఫియా హయత్ గుర్తుందా? బ్రిటన్‌కు చెందిన భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఆ మధ్య చాలా ప్రయత్నాలు చేసింది. తన హాట్ అండ్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అవకాశాలు రాలేదు. ఎంత ప్రయత్నించినా... తాను అనుకున్న స్థాయికి వెళ్లలేక పోయిన ఈ భామ... చివరకు సన్యాసం తీసుకుని నన్ గా మారినట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంతకాలం దైవచింతనలో గడిపింది కూడా.

శివుడికి జన్మనిచ్చింది తానే అంటూ

శివుడికి జన్మనిచ్చింది తానే అంటూ

నన్ అవతారంలో కొన్నాళ్లు కనిపించిన ఆమె అదే సందర్బం లో కైలాష్ యాత్రకు వెళ్లింది. ఈ యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగబాద్ లలో హిందువులు పూజించే శివాలన్ని సందర్శించిన ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశం అయింది. శివలింగం దగ్గర దిగిన ఫోటోలు పోస్టు చేసిన ఆమె శివుడికి జన్మనిచ్చింది తానే అంటూ ప్రకటించుకుంది.

ఇండస్ట్రీని వదిలిన తర్వాత

ఇండస్ట్రీని వదిలిన తర్వాత

'శివ లింగం దగ్గరకు వెళ్లగానే భారీ అయస్కాంత శక్తి తనలోకి ప్రవేశించిందని, ఆ సమయంలో ఎటూ కదలలేక పోయాను. కనీసం తలకూ ఎత్తలేక పోయాను. అప్పుడే నాకు అర్థమైంది...గత జన్మలో శివుడికి జన్మనిచ్చింది తానే అని' అంటూ ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. సోఫియా హయత్ ప్రవర్తన వింతగా ఉందని.... సినిమా, మోడలింగ్ ఇండస్ట్రీని వదిలిన తర్వాత ఆమె ఇలా అవుతుందని అసలు ఊహించలేదంటూ...ఆమె పరిస్థితి చూసి పాపం అంటూ జాలిపడ్డారు కూడా.

సన్యాసం వదిలేసి

సన్యాసం వదిలేసి

అంతలోనే మళ్ళీ ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత కొన్ని రోజులకి సన్యాసం వదిలేసి మళ్లీ ఫ్యాషన్‌ దుస్తులు వేసుకోవడం మొదలుపెట్టింది. తర్వాత నెమ్మదిగా పెళ్ళి వైపు అడుగులేసింది వ్లాట్ స్టానెస్ అతని పేరు. రొమేనియాకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ తో పెళ్ళికి సిద్దపడింది.

మా ప్రేమ పెళ్లి చాలా పవిత్రమైనది

మా ప్రేమ పెళ్లి చాలా పవిత్రమైనది

తాను ఓ వ్యక్తిని పెళ్లిచేసుకుంటున్నట్లు సోఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది, ‘త్వరలో నాకు కాబోయే భర్త పేరు వెల్లడిస్తాను. మార్చి మూడో లేదా నాలుగో వారంలో నా వివాహం జరగబోతోంది. ఆయన నాకు చాలా ప్రత్యేకం. మా ప్రేమ పెళ్లి చాలా పవిత్రమైనది. శివుడు, బుద్ధుడు సహా దేవుళ్లంతా నా పెళ్లికి హాజరుకాబోతున్నారు. స్వర్గంలో ఏసుప్రభు ఈ పెళ్లిని నిర్ణయించాడు' అని పోస్ట్‌ చేసింది.

 మక్కా యాత్ర

మక్కా యాత్ర

ఆమె చెప్పినట్టు మార్చిలో పెళ్ళి జరగ లేదు, మక్కా యాత్ర పూర్తయ్యాక ఇప్పుడు తాజా గా ఈజిప్షియన్ పద్దతిలో ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. రొమేనియన్ వ్యక్తి వ్లాడ్ స్టానెస్కూను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పి సడెన్ షాక్ ఇచ్చిన సోఫియా హయత్.. ఇప్పుడు ఆ తతంగం కూడా కానిచ్చేసింది.

పెళ్లి చేసేసుకుంది

పెళ్లి చేసేసుకుంది

రీసెంట్ గా తన కాబోయే భర్త వ్లాడ్ తో కలిసి మక్కా దర్శనం కూడా పూర్తి చేసుకున్న సోఫియా.. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంది కూడా. ఈజిప్షియన్ ఆచారాల ప్రకారం సోమవారం పెళ్లి చేసుకున్నారు వ్లాడ్- సోఫియాలు. ఇలా తను పెళ్లి చేసుకోవడం కూడా దేవుడి ఆదేశమే అంటూ సమర్ధించేసుకుంది సోఫియా.

 4 తెల్ల గుర్రాల రథంపై

4 తెల్ల గుర్రాల రథంపై

ఆ సంగతి అలా ఉంటే.. ఈ పెళ్లి ఫోటోలు వగైరా చూస్తుంటే మాత్రం.. సోఫియా హయత్ మాంచి జోడీనే వెతుక్కుందని చెప్పాలి. పెళ్లికి ముందు రోజున ఇవాళే మిస్ గా ఆఖరి రోజు.. పెళ్లి రోజు కోసం ఇక ఎదురుచూడలేకపోతున్నా లాంటి పోస్ట్ లతో అలరించిన సోఫియా.. 4 తెల్ల గుర్రాల రథంపై వెన్యూకు వచ్చి.. గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ నే చేసుకుంది. మొత్తానికి సోఫియా హయత్ మ్యారేజ్ ఓ సెన్సేషన్ అనాల్సిందే.

English summary
Sofia Hayat, who was in news for turning into a nun, finally tied the knot with Vlad Stanescu yesterday (April 24). The wedding took place as per Egyptian customs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu