»   »  అతనితో సహజీవనం: త్వరలో సోహా అలీ ఖాన్ పెళ్లి

అతనితో సహజీవనం: త్వరలో సోహా అలీ ఖాన్ పెళ్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్, నటి కరీనా కపూర్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి ముందు నుంచే వీరు కొన్సి సంవత్సరాల పాటు సహజీవనం చేసారు. అన్నయ్య దారిలోనే ప్రయాణించింది సైఫ్ చెల్లెలు సోహా అలీ ఖాన్. సోహా గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు కునాల్ ఖేముతో సహజీవనం చేస్తోంది.

తాజాగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. పారిస్‌లో తన ప్రియురాలు సోహా అలీ ఖాన్‌కి రింగ్ ఇచ్చి పెళ్లి ప్రపోజ్ చేసాడు కునాల్ ఖేము. ఈ విషయాన్ని సోహా అలీ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 'ఒక సంతోషకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కునాల్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసాడు. సంతోషంగా నేను ఓకే చెప్పాను' అని సోహా అలీ ఖాన్ వెల్లడించారు. త్వరలోనే వీరి పెళ్లి జరుగబోతోంది.

Soha Ali Khan, Kunal Khemu get engaged

చాలా రోజులుగా సోహా, కునాల్ ఒకే ఇంట్లోకి ఉంటున్నారు. పెళ్లి కాకుండానే ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. తల్లి షర్మిలా ఠాగూర్ త్వరగా పెళ్లి చేసుకుని జీవితంలో సెటి కావాలని ఆమెకు సూచిస్తుంటే.....ఆమె అన్నయ్య సైఫ్ మాత్రం 40 ఏళ్ల వయసు వచ్చాకే పెళ్లి కోసుకోమని అడ్వైజ్ ఇస్తూన్నాడట. ఈ విషయాలను సోహానే స్వయంగా వెల్లడించారు.

'మా అమ్మ పెళ్లి చేసుకోమని ఎప్పటి నుండో గొడవ పెడుతోంది...ఆమె మాట విని పెళ్లి చేసుకుని ఉంటే నేను ఇప్పటికి 20 మంది పిల్లలకు తల్లినయ్యేదాన్ని. కానీ అన్నయ్య సైఫ్ అలా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లంటే ఎంత సీరియస్ కమిట్ మెంటో ఆయనకు బాగా తెలుసు. జీవితంలో అర్థం చేసుకోవాల్సిన చాలా ఉంటాయి. అందుకే 40 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చాడు' అని సోహా చెప్పుకొచ్చింది.

సోహా అలీ ఖాన్ వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. 31 ఏళ్ల వయసున్న కునాల్ ఖేముతో సోహా సహజీవనం చేస్తోంది. కునాల్ గురించి ఎంతో గొప్పగా చెబుతోంది. కునాల్ తనకు అన్ని విషయాల్లో ఎంతో సపోర్టివ్‌గా ఉంటాడని, నన్ను ఎంతో సంతోషంగా ఉంచుతాడని చెబుతోంది సోహా.

English summary
Soha Ali Khan happily married will soon come true. The actress announced this on Twitter on Wednesday: "It gives me great happiness to share with you all that Kunal proposed to me in Paris with the most perfect ring in the world and I said 'yes'."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu