Just In
- 29 min ago
ఎందుకు రా ఇలా.. పేరెంట్స్ లేని మరో అభిమాని పిచ్చికి షాక్ అయిన నాగ చైతన్య
- 1 hr ago
Check Movie 10 days collections: నితిన్‌కు షాకిచ్చిన ఆడియెన్స్.. భయపెడుతోన్న భారీ టార్గెట్!
- 2 hrs ago
A1 Express 3 Days Collections: మోస్తరు స్పీడుతో వెళ్తోన్న A1 ఎక్స్‌ప్రెస్.. ఇంకా అంత వస్తేనే హిట్!
- 2 hrs ago
‘వకీల్ సాబ్’ నుంచి ఉమెన్స్ డే స్పెషల్ సర్ప్రైజ్: వాళ్లతో కలిసి వచ్చిన పవన్ కల్యాణ్
Don't Miss!
- Automobiles
అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి
- Sports
India vs England: టీ20 సిరీస్ ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ ఔట్! ఐపీఎల్ 2021కు డౌటే!
- News
షాకింగ్ : మెదక్‌లో మహిళపై యాసిడ్ దాడి.. మహిళా దినోత్సవం రోజే దారుణం...
- Lifestyle
మీకు డయాబెటిస్ ఉందా? మీరు ఎలాంటి పండు తినవచ్చో ఖచ్చితంగా తెలియదా? దీన్ని చదువు ...
- Finance
సౌదీ ఆరామ్కో టార్గెట్‌గా మిసైల్ అటాక్, భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజంతా గడుపుతా.. నేనే ఎక్కువగా బాధపడుతున్నా.. సోహెల్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షో వల్ల దాదాపు కంటెస్టెంట్లందరికీ మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఎవరో కొంత మంది మాత్రమే విపరీతమైన నెగెటివిటీని మూట గట్టుకుంటారు. కానీ దాదాపు అందరికీ మంచి క్రేజ్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ దక్కుతుంది. ఒకప్పుడు వందల్లో వేల సంఖ్యల్లో ఉన్న ఫాలోవర్లు బిగ్ బాస్ వల్ల లక్షలకు చేరుకుంటారు. అలా నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మందికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

అందరూ ఫేమస్..
బిగ్ బాస్ నాల్గో సీజన్ వల్ల చాలా మంది వెలుగులోకి వచ్చారు. అంతకు మునుపు ఎవ్వరో కూడా పరిచయం లేని వారు సైతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. దివి, సోహెల్, అఖిల్, అరియానా వంటి వారికి మంచి క్రేజ్ వచ్చింది. అందరిలోకెల్లా ఇప్పుడు సోహెల్ మాత్రం మంచి ఫాంలో ఉన్నాడు.

ఆటను తిప్పేశాడు..
కథ వేరే ఉంటది అనే డైలాగ్ కొట్టి కొట్టి దాన్ని ఓ బ్రాండ్‌లా మార్చేశాడు సోహెల్. చివరకు నిజంగానే కథ వేరే ఉంటది అని నిరూపించాడు. 25 లక్షలు తీసుకుని ఆటను యూటర్న్ తిప్పేశాడు. మామూలుగా రన్నర్ అవ్వాల్సిన సోహెల్ 25 లక్షలు తీసుకుని సెన్సేషనల్ అయ్యాడు.

బయటకు వచ్చి అలా..
బిగ్ బాస్ విజేత గురించి కాకుండా సోహెల్ గురించి అందరూ మాట్లాడుకున్నారంటేనే అక్కడ ఏ రేంజ్‌లో ఫేమస్ అయ్యాడో తెలుస్తుంది. పైగా అందరి కంటే ముందుగా సినిమాను ప్రకటించాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు తెలిపాడు. సోషల్ మీడియాలో తన సినిమాకు సంబంధించిన అప్డేట్లను కూడా పెడుతున్నాడు.

సోషల్ మీడియాలో రచ్చ..
ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత తన ఫాలోయింగ్‌ను చూసుకుని సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ... అందరితో మాట్లాడాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే తాజాగా సోహెల్ ఓ వీడియోను షేర్ చేశాడు.

ఆ పోస్ట్‌తో..
సోహెల్ఏదైనా పోస్ట్ పెడితే దాని కింద లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఒక్క రిప్లై ఇవ్వు అన్నా, హాయ్ చెప్పు అన్నా అని అడుగుతున్నారు. అలా అందరూ రిక్వెస్ట్ చేయడంపై సోహెల్ స్పందించాడు. తాను అందరితో మాట్లాడాలని, అందరికీ రిప్లై ఇవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నానని కానీ కుదరడం లేదని చెప్పుకొచ్చాడు. రిప్లై రాకపోతే ఎంతగా బాధపడుతున్నారో.. అంతకు మించి ఎక్కువగా నేనే బాధపడుతున్నానని తెలిపాడు. ఒక రోజు ఫ్యాన్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తా.. ఆ రోజంతా మీతోనే గడుపుతాను అని చెప్పుకొచ్చాడు.