Just In
- 3 min ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 51 min ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 11 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- News
కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బోణి కొట్టిన సాయిధరమ్ తేజ్.. థియేటర్లలో సోలో బ్రతుకే సో బెటర్
లాక్ డౌన్ దెబ్బతో దాదాపు 10 నెలల తరువాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ బిగ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఫైనల్ గా నేడు విడుదల అవుతుండడంతో ఇండస్ట్రీలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమాకు సంబందించిన రిజల్ట్ పై అందరు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ముందే వీక్షించారు. ఇక ట్విట్టర్ ద్వారా సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుతున్నారు. నెటిజన్స్ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హౌజ్ఫుల్ కలెక్షన్స్
రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి బెనిఫిట్ షోలను ప్రదర్శించారు. సినిమాకు చాలా పాజిటివ్ గా రిపోర్ట్స్ అందుతున్నాయని ప్రొద్దుటూరు-వేంకటేశ్వర.. థియేటర్ సిటింగ్ కెపాసిటీ 544..హౌస్ ఫుల్ గ్రాస్ 52,768తో మంచి రెస్పాన్స్ అందుకున్నట్లు ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

మళ్ళీ సాధారణ స్థితికివచ్చింది
రాజమౌళి ట్వీట్ చేస్తూ.. రియల్ సినిమా అనుభూతి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. మూవీ లవర్స్ అందరికి ఒక సంతోషకరమైన వార్త. గ్రేట్ ప్రసాద్ గారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కు కూడా బెస్ట్ విషెస్ ను అందించిన రాజమౌళి థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత పెద్ద సినిమాని రిలీజ్ చేస్తున్నారని వారందరికీ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు.

బిగ్ స్క్రీన్ పై విడుదలవుతున్న ఫస్ట్ మూవీ.
ఈ క్రిస్టమస్ కానుకగా విడుదలవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ టీమ్ సబ్యులకు నా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను. కరోనా పాండమిక్ అనంతరం బిగ్ స్క్రీన్ పై విడుదలవుతున్న ఫస్ట్ మూవీ. ఇదొక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. చిత్ర యూనిట్ సబ్యులకు నా అభినందనలు. అలాగే అందరికి బెస్ట్ విషేష్ అని తెలిపిన మహేష్ పేస్ హగ్గింగ్ అని కూడా ట్వీట్ చేశారు.

అబీజీత్ స్పెషల్ ట్వీట్
బిగ్ బాస్ సీజన్విన్నర్ అభిజీత్ కూడా సినిమాపై స్పెషల్ ట్వీట్ వేశారు. ఫైనల్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. సోలో బ్రతుకే సో బెటర్ మొదటి రోజు మొదటి షో పక్కా.. బ్యాక్ టూ సినిమా.. వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ అభి వివరణ ఇచ్చాడు.

మనం అందరం సపోర్ట్ చేద్దాం
నిజంగా థియేట్రికల్ అనుభూతి మళ్ళీ రావడం చాలా మంచి విషయం. సాయి ధరమ్ తేజ్, అలాగే నిర్మాత ప్రసాద్ గారికి సోలో బ్రతుకే సో బెటర్ టీమ్ మొత్తం సబ్యులకు బెస్ట్ విషెస్ అని ట్వీట్ చేసిన రామ్ చరణ్.. మన థియేట్రికల్ ఎకో సిస్టమ్ యొక్క పునరుద్ధరణకు మద్దతు ఇద్దాంమని తెలియజేశారు.

సంతోషంగాఉంది
ఇక చాలా రోజుల తరువాత సినిమాను చూసేందుకు మెగా అభిమానులు క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా అనుభూతిని పొందుతున్నట్లు ట్వీట్ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత థియేటర్ కు వచ్చినందుకు సంతోషంగా ఉందని ఒక మెగా అభిమాని వివరణ ఇచ్చాడు.