»   » కొన్ని భావోద్వేగాలను వివరణ అవసరం లేదు: కళ్యాణ్ రామ్ ట్వీట్

కొన్ని భావోద్వేగాలను వివరణ అవసరం లేదు: కళ్యాణ్ రామ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి కళ్యాణ్ రామ్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. హరికృష్ణ పుట్టినరోజు సంద‌ర్భంగా 'పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు నాన్న' అంటూ ట్వీట్ చేయడంతో పాటు ఓ ఫోటో షేర్ చేశారు.

ఇంట్లోనే సింపుల్‌గా నాన్నతో కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేట్ చేసిన కళ్యాణ్ రామ్....నాన్నతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. 'కొన్ని భావోద్వేగాల‌కు వివ‌ర‌ణ అవ‌స‌రం లేదు' అంటూ తండ్రితో తనకున్న అనుబంధాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

కళ్యాణ్ రామ్ ట్విట్టర్ పోస్ట్

నందమూరి హరికృష్ణ 1952, సెప్టెంబర్ 2న జన్మించారు. ప్రముఖ నటుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు.

హరికృష్ణ

హరికృష్ణ చిన్నతనంలో బాలనటుడుగా రెండు చిత్రాల్లో నటించారు. శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్లామా చిత్రాల్లో చేశారు. ‘తాతమ్మ కళ'(1994) చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఆ తర్వాత ఆయన చాలా కాలం సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామ రాజు, సీతయ్య లాంటి చిత్రాల్లో నటించారు.

రాజకీయాల్లో..

రాజకీయాల్లో..

తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం

ప్రస్తుతం

ప్రస్తుతం హరికృష్ణ సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఇద్దరు కుమారులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ ఇందుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు.

English summary
"Some emotions don't need a description :)" Kalyan Ram tweeted on the occasion of his father's birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu