»   » ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ బాక్సాఫీస్ రిపోర్ట్

‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ బాక్సాఫీస్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Something Something
హైదరాబాద్ : సిద్ధార్థ, హన్సిక, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రూపొందిన 'సమ్‍‌థింగ్ సమ్‍‌థింగ్' చిత్రం జూన్ 14న విడుదలైన సంగతి తెలిసిందే. మంచి ఎంటర్టెనర్, టైంపాస్ మూవీ అని పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ మంచి కలెక్షన్సే సాధించింది. ఇండియాలో ఈ చిత్రం దాదాపు 10 కోట్లు వసూలు చేయగా, యూఎస్‌లో రూ. 13.22 లక్షలు వసూలు చేసింది.

యూఎస్‌లో ఈచిత్రం మొత్తం 15 స్క్రీన్లలో విడుదలైంది. వీకెండ్ మూడు రోజుల్లో $22,787 (రూ. 13.22 లక్షలు) వసూలు చేసింది. అంతకు ముందు వారం విడుదలైన 'ప్రేమకథా చిత్రమ్' 14 స్క్రీన్లలో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితం అవుతూ $21,468 వసూలు చేసింది.

భారత్‌లో 'సమ్‍‌థింగ్ సమ్‍‌థింగ్' మొదటి రోజు దాదాపు రూ. 3.5 కోట్లు వసూలు చేసింది. రెండో రోజైన శనివారం రూ. 3.3 కోట్లు వసూలు చేసింది. ఆదివారం మాత్రం దాదాపుగా రూ. 4.2 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి తొలి వీకెండ్ మూడు రోజుల్లో రూ. 10 కోట్ల మార్కును దాటింది.

English summary
Last week's Telugu releases Something Something and Saradaga Ammayitho made average collections over the weekend. Something Something made the highest collection of little more than Rs 10 crores in India and Rs 13.22 lakhs in the US.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu