»   » సిద్దార్ద్ 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' శాటిలైట్ రైట్స్ అంతా??

సిద్దార్ద్ 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' శాటిలైట్ రైట్స్ అంతా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : సిద్దార్థ్‌ నటించిన 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ దర్శకుడు సుందర్ .సి డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం రైట్స్ 3.40 కోట్లకు అమ్ముడు అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రైట్స్ ని జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. వరస ప్లాప్ ల్లో ఉన్న సిద్దార్ధకు ఈ రేంజి రేటు రావటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


సిద్దార్ధ చిత్రం గురించి మాట్లాడుతూ- ''ఇందులో నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ సందర్భంలో ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. ఆ అమ్మాయి నావైపు తిరిగి చూస్తుంది. అప్పుటి వరకూ 'ఓకే'. మళ్లీ రెండోసారి నావైపు తిరిగి చూడాల్సిన అవసరం ఆ అమ్మాయికి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా. యువతరానికే కాదు, మా అమ్మకు కూడా ఈ సినిమా నచ్చుతుంది'' అన్నారు.

అలాగే ... ''అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా భయపడే కుర్రాడిని ఓ లవ్‌ గురు లవర్‌బాయ్‌గా ఎలా మార్చాడు అన్నదే కథ. ఈ సినిమా ప్రధానంగా మూడు పాత్రల మధ్య జరుగుతుంది. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కనిపిస్తాను. నాకు ప్రేమ పాఠాలు చెప్పే లవ్‌గురు పాత్రను బ్రహ్మానందం చేశారు. యువతుల మనస్తత్వం ఏమిటి, వారితో ఎలా మాట్లాడాలి లాంటి విషయాలు ఆయన నాకు బోధిస్తారు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఎవర్నీ వూహించుకోలేం. నేను కళాశాలలో చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి. అందుకే ఇందులో అప్పటి హావభావాలు కొన్ని ఈ సినిమాలో వాడాను. 'ఓ మై ఫ్రెండ్‌' తరవాత హన్సిక, నేను కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆమె తన గత చిత్రాల కంటే అందంగా కనిపిస్తుంది. చాలా సన్నబడింది కూడా'' అన్నారు.

English summary

 Siddharh,Hansika starrer ‘Something Something’ directed by C.Sunder is readying for release soon. According to latest information, the film's satellite rights are bagged by Gemini TV for Rs 3.40 crs. Khushboo is producing the film. Satya is the music director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu