»   » 'S/O సత్యమూర్తి' కొత్త ఫోటోలు అదిరాయ్

'S/O సత్యమూర్తి' కొత్త ఫోటోలు అదిరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'S/O సత్యమూర్తి' విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్లు విస్తృతం చేసారు. తమదైన ప్రమోషన్ స్ట్రాటజీ కొనసాగిస్తూ అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. ఇందులో సినిమా సినిమాకు సంబంధించిన కొత్త స్టిల్స్ విడుదల చేసారు.

ఈ ఫోటోలు చూస్తుంటే సినిమా ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా సమంత, అల్లు అర్జున్, నిత్య మీనన్ లుక్ సినిమాలో అదిరిపోయే విధంగా ఉండనుంది. సినిమాటోగ్రపీ అద్భుతంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

'S/O సత్యమూర్తి' సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఆడియన్స్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. సినిమా తమను వందకు వందశాతం సంతృప్తి పరుస్తుందని భావిస్తున్నారు.

స్లైడ్ షోలో కొత్త ఫోటోలు, సినిమాకు సంబందించిన వివరాలు..

సెన్సార్

సెన్సార్


సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ‘U/A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సెన్సార్ రిపోర్టు రావడంతో నిర్మాతలు ఆనందంగా ఉన్నారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్


ఈ చిత్రం రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఖరారైంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్


అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న భారీ ఆదరణ నేపథ్యంలో సినిమాను అత్యధిక సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

క్లైమాక్స్ అదుర్స్

క్లైమాక్స్ అదుర్స్


చిత్రంలో 25 నిముషాల క్లైమాక్స్ ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాలో హైలెట్ అని చెప్తున్నారు. ఫస్టాఫ్ ...ఫన్ తో గడిచిపోయి..ఇంటర్వెల్ కు సీరియస్ మోడ్ లోకి వెళ్లినా..సెకండాఫ్ మాత్రం కొత్త మలుపులతో సాగుతుందంటున్నారు. పూర్తిగా వన్ లైనర్స్ తో ఈ క్లైమాక్స్ సాగుతుందని, హై ఎమోషనల్ సెటప్ లో చాలా ఇంటెన్స్ గా ఈ క్లైమాక్స్ ఉండబోతోందని చెప్పుకుంటున్నారు.

యాక్షన్ సీక్వెన్స్

యాక్షన్ సీక్వెన్స్


ఇదే ఎపిసోడ్ లోనే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని, అది మైండ్ బ్లోయింగ్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం. అత్తారింటికి దారేది తరహాలో ఈ క్లైమాక్స్ ...ఫ్యామిలీ ప్రేక్షకులను పదే పదే థియోటర్స్ కు రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు.

నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ

నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ


‘‘బన్ని, త్రివిక్రమ్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు తెరకెక్కించారు. అల్లు అర్జున్‌ పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సమంత, నిత్యామీనన్‌, అదాశర్మ తమ అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంటారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీగా ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.

నటీనటులు

నటీనటులు


సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం


ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Actor Allu Arjun, Actress Samantha, Nithya Menon starring S/O Satyamurthy Movie Stills. S/O Satyamurthy is undergoing its censor formalities. According to the latest update, the film has received an U/A certificate from the censor board.
Please Wait while comments are loading...