»   » నీ పని నువ్వు చూస్కో, పాటలేందుకు? ఇలా తిట్టుకున్నారిద్దరూ

నీ పని నువ్వు చూస్కో, పాటలేందుకు? ఇలా తిట్టుకున్నారిద్దరూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫ్రొఫెషనల్ సింగర్ కి ఒక విషయం లో కాస్త కోపంగా ఉంటుంది. మామూలుగా పాడటం వేరు ఫ్రొఫెషనల్ గా పాడటం వేరు. అయితే ఆటో ట్యూనర్ పుణ్యమా అని ఇప్పుడు నటులు కూడా సింగర్లుగా మారిపోతున్నారు. "ఒకప్పుడు సింగర్లలో మంచి నటులుండేవారు.. అది పైవాడి దయ, ఇప్పుడు నటుల్లో మంచి సింగర్లూ ఉంటున్నారు ఇది ఆటో ట్యూనర్ దయ" అంటూ ప్రనుఖ సింగర్, రియాలిటీ షో నిర్వాహకురాలు సుగంధ మిశ్రా గతం లో ఒక సారి ఈ విషయం లో పంచ్ విసిరింది కూడా.

అయితే ఈ సారి బాలీవుడ్ గాయకుడు అర్మాన్ మాలిక్ మాత్రం అంత స్మూత్ గా సెటైర్ వెయ్యలేదు జస్టిన్‌ బీబర్‌ కాన్సర్ట్‌లో పాడేందుకు సిద్ధమవుతోన్న బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా మీద ట్విటర్ సాక్షిగా నిర్మొహమాటంగానే కాస్త తగ్గమంటూ చెప్పేసాడు. నటులు, గాయకులు వేరని, ఎవరి ప్లాట్‌ఫామ్‌ వారికి వదిలేస్తే మంచిదని సూచించాడు.

Sonakshi Sinha, Armaan Malik argue on Twitter

అంటే ఇండైరెక్ట్ గా జస్టిన్ వీవర్ తో సమానంగా పాడేంత గాయనివి కాదు నువ్వింకా అంటూ చురక వేసాడు. దీనికి సోనాక్షి హర్ట్‌ అయి, కొత్త ఆర్టిస్ట్‌ వచ్చినపుడు ఎంకరేజ్‌ చేయాలి కానీ ఇలా మాట్లాడడం సబబు కాదని అంటూనే. నూర్ సినిమాలో తాను పాడిన పాట విషయం లో జరిగిన సంఘటనని బయటికి చెప్తూ "మరి నూర్‌ సినిమాలో నన్ను పాడమంటూ అడిగినపుడు ఈ ఫ్రొఫెషనలిజం ఏమైందంటూ" అర్మాన్‌ని నిలదీసింది.

అయితే దీనికి కూడా సమాధానం చెప్తూ అది అడిగింది తాను కాదని, తన సోదరుడు అమాల్‌ మాలిక్‌ అని అతను సరిచేసాడు. ఇద్దరూ కలిసే వచ్చి రిక్వెస్ట్‌ చేసారంటూ సోనాక్షి మళ్ళీ ఎదురు తిరిగింది. దానికి ఆమెని కామెడీ చేస్తూ ఆ సింగర్‌ ఒక స్మయిలీ వేసాడు. మొత్తానికి వీరిద్దరి ఆర్గ్యుమెంట్‌ ట్విట్టర్లో కాస్త కాలక్షేపానికి అవకాశమిచ్చింది. దీనివల్ల వాళ్ళ ఎవ్వరికి ఏం ఒరిగిందో గానీ "నూర్" లో సొనాక్షి తో పాడించి తానూ సింగరే అన్న నమ్మకాన్ని పెంచేసాక ఇప్పుదు ఎవ్వరూ ఆపలేరు మరి.....

English summary
Armaan has crooned the title track of Sonakshi’s latest release Noor. Sonakshi took a dig at Armaan, saying he wanted her to sing for him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu