»   » కాలు జారిన సల్మాన్ ఖాన్ ప్రియురాలు...!

కాలు జారిన సల్మాన్ ఖాన్ ప్రియురాలు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దబాంగ్" చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన తొలి సారిగా నటించిన బాలీవుడ్ నటుడు శతఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా కాలు జారిందట. అసలు ఇంతకీ విషయమేంటని అంటున్నారా? తొలి చిత్రంతోనే హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన సోనాక్షి బెంగళూరులో జరిగిన ఓ ఫ్యాషన్ షో లో ఒయ్యారాలను ఒలకపోసింది. అయితే ఆ షోలో ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ...కాలు జారి కిందపడి పోయింది వెంటనే దాని నుండి తేరుకొని కవర్ చేస్తూ తిరిగి క్యాట్ వాక్ చేయడం ప్రారంభించింది.

అయితే ర్యాంప్ పై ఇవన్ని సర్వసాధారణమేననీ, ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదనీ, అయిన వెంటనే తేరుకొని ర్యాంప్ పై క్యాట్ వాక్ అదరగొట్టేశాననీ ఆ తర్వాత రిలాక్స్ గా చెప్పుకొచ్చింది సోనాక్షి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu