»   » ప్రిన్స్‌పై మనసు పడిన దబాంగ్ గర్ల్ సోనాక్షి సిన్హా

ప్రిన్స్‌పై మనసు పడిన దబాంగ్ గర్ల్ సోనాక్షి సిన్హా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్ బాబును ఇష్టపడనని చెప్పే వారు ఉండరేమో. మహేష్‌పై మనసు పడ్డ కథానాయికలలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా చేరింది. సోనాక్షి తన మొదటి సినిమా దబాంగ్‌తోనే ఓవర్ నైట్ స్కోరు కొట్టేసింది. సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా నాయికా, నాయకులుగా వచ్చిన దబాంగ్ పెద్ద విజయం సాధించింది. దీంతో ఆమెకు పది సినిమాలకు రావాల్సిన క్రేజ్ వచ్చింది. దీంతో ఆమె కోసం నిర్మాతలు వరుస కడుతున్నారు. నిర్మాతలతో పాటు పలువురు హీరోలు కూడా ఆమె కోసం సిఫార్సు చేస్తున్నారంట. బాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాది వాళ్లు కూడా సోనాక్షి కోసం చూస్తన్నారంట. అయితే సోనాక్షి మాత్రం మహేష్ బాబుపై మనసు పడిందంట. ప్రిన్స్ చిత్రంలో అవకాశం వస్తే నటిస్తానని చెప్పిందంట. అయితే మహేష్‌పై ఇష్టానికి మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీకే సోనాక్షి కూడా అంబాసిడర్‌గా ఉంది.

ప్రిన్స్‌ను పెళ్లి చేసుకుంది కూడా బాలీవుడ్ భామ నమ్రతా శిరోద్కర్ కావడం విశేషం. ఇక దబాంగ్ చిత్రంతో ఆమెకు వచ్చిన క్రేజ్ ఆమెకు వరుస ఆఫర్లు తెచ్చిపెడుతుందంట. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన నటిస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అదెంత వరకు నిజమో కాని అవసరమైతే తాను చిరంజీవి, మోహన్ బాబు వంటి వయసు మళ్లిన వారితో కూడా నటిస్తానని చెప్పిందంట. తనకు ఆఫర్ నచ్చాలే కాని హీరో ఎవరు అనేది సంబంధం లేదని చెబుతుందంట ఈ దబాంగ్ ముద్దుగుమ్మ.

English summary
Dabangg heroine Sonakshi Sinha is liked very much prince Mahesh Babu. She was introduced in Dabangg cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu