»   » ఆ సీన్ గురించి రచ్చ : సెన్సార్ బోర్డు తీరుపై సోనాక్షి ఫైర్

ఆ సీన్ గురించి రచ్చ : సెన్సార్ బోర్డు తీరుపై సోనాక్షి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెన్సార్ బోర్డు వ్యవహార శైలి ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులు బోర్డు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. తాజాగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సెన్సార్ బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు.

సోనాక్షి సిన్హా నటించిన తాజా చిత్రం 'నూర్‌' ఇటీవల కేంద్ర సెన్సార్ బోర్డు వద్దకు పరిశీలనకు వెళ్లింది. అయితే సినిమాలో జర్నలిస్టు బర్ఖా దత్‌ పేరు ప్రస్తావన రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ...దత్‌ పేరు వచ్చే డైలాగలను బీప్‌ శబ్దం బ్లాక్ చేయాలని సూచించిందట.

ఒకే అభిప్రాయం లేదంటూ సోనాక్షి విమర్శ

ఒకే అభిప్రాయం లేదంటూ సోనాక్షి విమర్శ

సెన్సార్ బోర్డు తీరుపై సోనాక్షి మండి పడింది. ‘బోర్డు సభ్యుల మధ్య సరైన అవగాహన లేదు. అందుకే ఒక సినిమాకి కరెక్ట్‌ అనిపించింది.. మరో సినిమాకి వచ్చేసరికి తప్పుగా కనిపిస్తుంది. ముందు సెన్సార్‌బోర్డు తమ అభిప్రాయాలను మార్చుకోవాలి. వాళ్లంతా ఒకే అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'' అని సోనాక్షి అన్నారు.

నూర్

నూర్

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ‘నూర్' చిత్రంలో జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుంది. సునీల్‌ సిప్పీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌, రచయిత సబా ఇంతియాజ్‌ రాసిన 'కరాచీ యు ఆర్‌ కిల్లింగ్‌ మీ' పుస్తకం ఆధారంగా రూపొందుతుంది. కరాచీలో ఉండే ఆయేషా పాత్ర ప్రధానంగా ఈ మూవీ సాగనుండగా నూర్‌ రాయ్‌ చౌదరిగా సోనాక్షి కనిపించనుంది.

నూర్ ట్రైలర్ 1

టీ సిరీస్‌, అబండాండియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. 12 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

నూర్ ట్రైలర్ 2

ఏప్రిల్ 21న నూర్ చిత్రాన్నిరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

English summary
The Central Board of Film Certification (CBFC) has recently asked Noor makers to edit a reference to journalist Barkha Dutt in the film. Now, film’s leading lady Sonakshi Sinha says that censor board needs to have a uniform approach while censoring movies. Sonakshi told IANS, “The censor board really needs to come to a consensus within themselves on what is right in one film… Is not right in another film.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu