»   » ఆమె ఐటం సాంగ్ రెమ్యునేషన్ రెండున్నర కోట్లు

ఆమె ఐటం సాంగ్ రెమ్యునేషన్ రెండున్నర కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా సినిమాల్లో కిక్ ఇవ్వటానికి స్టార్ హీరోయిన్స్ చేత ఐటం సాంగ్స్ చేయంచటానికి దర్శక,నిర్మాతలు ఆసక్తి చూపుతూంటారు. అయితే అందుకోసం మంచి బడ్జెట్ నే కేటాయించి, ఆ ఎలిమెంట్ ని పబ్లిసిటీలో వాడుతూంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఐటం సాంగ్ చేయటానికి రెండున్నర కోట్లు రెమ్యునేషన్ అడిగి సంచలనం సృష్టించింది. ఇప్పటికే 75 లక్షలు ఇందు నిమిత్తం ఆమెకు అడ్వాన్స్ ముట్టిందని తెలుస్తోంది. ఆమె ఇంత కాస్టలీ ఎమౌంట్ తీసుకుని మరీ చేసే ఐటం సాంగ్ ఏ సినిమాలోది అంటే ఈ క్రింద వివరాలు చదవాల్సిందే.

Sonakshi Sinha

సోనాక్షి సిన్హా తొలిసారిగా రెమో డిసౌజా నృత్య దర్శకత్వంలో నర్తించబోతోంది. ఇప్పటివరకూ ఆమె ఎక్కువగా ప్రభుదేవా నృత్యరీతులు సమకూర్చిన పాటలకే నర్తించింది. 'తేవర్‌' సినిమాలోని ఓ పాటకు రెమో కొరియోగ్రఫీ చేస్తున్నారు. 'అతనితో పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నాన'ని సోనాక్షి ట్వీట్‌ చేసింది.


'తేవర్‌' సినిమా తెలుగులో వచ్చిన 'ఒక్కడు' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో బోనీ కపూర్‌ కుమారుడు అర్జున్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. అమిత్‌ శర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నమోదు చేసుకొన్న 'తేవర్‌' టైటిల్‌ను బోనీకపూర్‌ అడిగి మరీ తీసుకొని ఈ చిత్రానికి నిర్ణయించారు. ఆగ్రా నేపథ్యంలో కథ నడుస్తుంది.

English summary

 
 
 Sonakshi Sinha has slowly firmed her base as an item girl apart from a successful Bollywood actress. After grooving with ace choreographer turned director Prabhudeva in ‘Go Govinda’ in ‘Oh My God’, the actress bagged another lavish and costliest item number. She will shake her legs in Arjun Kapoor starrer, ‘Tevar’ and guess what? The price of the item song is 2.5 crore. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu