»   » ‘అకీరా’ ట్రైలర్ కేక : సోనాక్షిలో ఇంత విషయం ఉందా?

‘అకీరా’ ట్రైలర్ కేక : సోనాక్షిలో ఇంత విషయం ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం అకీరా. తమిళంలో ఐదేళ్ళ క్రితం వచ్చిన మౌనగురు అనే చిత్రాన్ని అకీరా పేరుతో బాలీవుడ్ లో మురుగదాస్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

పవన్‌తో పాటు కొడుకుతో లింక్: అందుకే రేణు దేశాయ్‌కి చాలా స్పెషల్!

ఇప్పటి వరకు సోనాక్షిని గ్లామర్ పాత్రల్లో, ఇతర మామూలు పాత్రల్లో మాత్రమే చూసాం.... కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో ఆమెను పుల్ ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రజంట్ చేసాడు దర్శకుడు మురుగదాస్. ట్రైలర్ చూసిన వారంతా... సోనాక్షి యాక్షన్ సీన్లు ఇంత బాగా చేయగలుగుతుందా? అంటూ ఆశ్చర్య పోతున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతేన్నాడు. అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించనున్నాడు. ట్రైలర్లో అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సినిమాలో కూడా అతని పాత్ర కీలకంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

 Sonakshi Sinha's Akira Official Trailer

సెప్టెంబర్ 2, 2016న అకీరా చిత్రం థీయేటర్లలోకి రానుంది. ఇప్పటికే హిందీలో గజనీ, హాలిడే లాంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా మురుగదాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో 'అకీరా' సినిమాపై బాలీవుడ్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

English summary
This September action will unleash as A.R.Murugadoss’ Akira. Watch Sonakshi Sinha in a never before action avtar. Here’s the official trailer. Akira is an action drama film directed by A.R. Murugadoss and produced by Fox Star Studios & A. R. Murugadoss starring Sonakshi Sinha, Konkana Sen Sharma and Anurag Kashyap. Releasing 2nd September 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu