»   » హాట్ అండ్ సెక్సీగా సోనాక్షి అదరగొట్టింది (తొలి సింగిల్ ఆల్బం)

హాట్ అండ్ సెక్సీగా సోనాక్షి అదరగొట్టింది (తొలి సింగిల్ ఆల్బం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటీమణులు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా...తమలోని మల్టీ టాలెంటును ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. యాక్టర్స్ గా రాణిస్తూనే సింగర్ గా తమ ప్రతిభ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో ప్రియాంక చోప్రా సింగిల్ ఆల్బమ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రద్ధా కపూర్, అలియా భట్ కూడా సింగర్లుగా రాణిస్తున్నారు.

తాజాగా సోనాక్షి సిన్హా కూడా ఈ దిశగా అడుగులు వేసింది. 'ఆజ్‌ మూడ్‌ ఇష్క్‌ హాలిక్‌ హై..' అంటూ సాగే వీడియో సాంగ్‌లో స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా హాట్ అండ్ సెక్సీ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ పాట పాడింది కూడా ఆమెనే. గుల్షన్ కుమార్ సమర్పణలో మీట్‌ బ్రోస్‌, టీ సీరిస్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ను ఇండియాలో మోస్ట్ పాపులర్ మొబైల్ వెబ్ బ్రౌజర్ ‘యూసి వెబ్ బ్రౌజర్'తో అసోసియేట్ అయి విడుదల చేశారు. తొలుత ఎక్స్‌క్లూజివ్‌గా యూసి బ్రౌజర్లో మాత్రమే టీజర్ విడుదల చేసారు. తర్వాత టి సిరీస్ యూట్యూబ్ ఛానల్ లో పూర్తి వీడియో రిలీజ్ చేసారు.

CLICK HERE TO WATCH THE SONG

'ఆజ్‌ మూడ్‌ ఇష్క్‌ హాలిక్‌ హై..' పాటకు కుమార్‌ బాణీలు సమకూర్చారు. మీట్‌ బ్రోస్‌ సంగీతమందించారు. డాన్స్ ఇండియా డాన్స్ ఫేమ్ సల్మాన్ యూసఫ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. పాటలో సోనాక్షి లంబొర్గిని లగ్జరీ కార్‌ నడుపుతూ ప్రియుడితో కలిసి విహరిస్తూ స్టైలిస్ లుక్ లో దర్శనమిస్తోంది. డెనిమ్ షార్ట్స్, వైట్ కలర్ టాప్, ఓవర్ సైజ్ ష్రగ్, హిప్పీస్ లుక్, కళ్ళకు ఏవియేటర్ గ్లాసెస్‌తో సోనాక్షి సిన్హా పూర్తి వైవిద్యంగా కనిపించింది.

Sonakshi Sinha's debut song Aaj Mood Ishqholic with UC Browser

గోవా బీచ్ ప్రాంతంలో ఎంతో అందంగా ఈ ఆల్బం చిత్రీకరించారు. 'ఆజ్‌ మూడ్‌ ఇష్క్‌ హాలిక్‌ హై..' వీడియోకు మంచి స్పందన వస్తోంది. వారం క్రితం యూట్యూబ్ లో రిలీజైన ఈ వీడియోను ఇప్పటి వరకు 25 లక్షల మంది వీక్షించారు. యూసి బ్రౌజర్ తో అసోసియేట్ అవ్వడం కూడా పాపులారిటీ పరంగా కలిసొచ్చింది.

ఈ సాంగ్ గురించి సోనాక్షి సిన్హా మాట్లాడుతూ...‘నా తొలి సింగిల్ ఆల్బం రిలీజ్ అవ్వడం చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. చాలా కాలంగా ఎదరు చూస్తున్న నా కల ఇపుడు సాకారమైంది. ఇష్క్ హాలిక్ పాషన్ ప్రాజెక్ట్....ప్రతి ఒక్కరూ ఈ ఆల్బం ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను' అన్నారు.

టీ సిరీస్ సంస్థ హిట్ మ్యూజిక్, వీడియోస్‌ ద్వారా యువతను నిరంతరాయంగా ఎంటర్టెన్ చేస్తోంది. ఇండియాలో మోస్ట్ పాపులర్ మొబైల్ వెబ్ బ్రౌజర్‘యూసీ వెబ్ బ్రౌజర్'తో కలిసి విడుదల ఈ ఆల్బం విడుదల చేయడంతో యూత్ కు తొందరగా ఈ ఆల్బం రీచ్ అయింది.

యూసీ వెబ్ ఇండియా ఎండీ కెన్నీయె స్పందిస్తూ...‘మేము నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మొబైల్ జీవనశైలి కలి అనుగుణంగా మార్పులు తెస్తున్నాం. ఇండియాలో యూసి వెబ్ బ్రౌజర్ నెం.1 స్థానంలో ఉంది. ఎక్స్‌క్లూజివ్‌గా బాలీవుడ్ కంటెంట్ అందిస్తున్నాం. సాంగ్స్, మూవీస్, వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్నాం. సోనాక్షి సిన్హా తొలి ఆల్బం యూసి బ్రౌజర్లో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పగలను' అన్నారు.

English summary
After her contemporaries Alia Bhatt and Shraddha Kapoor, it's now Sonakshi Sinha's turn to prove her mettle as a singer. Yes, her new song 'Aaj Mood Ishqholic Hai', has been launched by T-Series, in association with UCWeb, maker behind India's most popular mobile browser - UC Browser.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu