»   » అయితే చూస్కోండి....! రియల్ ఫీట్ చూపించిన సోనాక్షి... నోళ్ళు తెరిచి అలా ఉండిపోయారు

అయితే చూస్కోండి....! రియల్ ఫీట్ చూపించిన సోనాక్షి... నోళ్ళు తెరిచి అలా ఉండిపోయారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బయటైతే కష్టం గానీ సినిమాల్లో అయితే ఏ ఫీట్ అయినా చేసేయొచ్చు..., ఎంత ఎత్తునుంచైనా దూకేయొచ్చు... ఒక వేళ మనకు కుదరకుంటే డూప్ లతో చేయించొచ్చు... ఎటూ గ్రాఫిక్స్ సాయం ఉండనేఉంది బ్లూ మ్యాట్ వేసి లాగించవచ్చు..., ఎంత పెద్ద హీరో అయినా సినిమాలో చేసిన ఫీట్ ని బయట కూడా చేయమంటే కష్టమే....

అదే యాక్షన్ సీన్ లో ఉన్న మాదిరి గా వొళ్ళు వంచాలంటే హీరోకే కాదు ఎవరికైనా కష్టమే.... ఇక ఆ ప్లేస్ లో హీరోయిన్ గనక ఉంటే ఇక చెప్పక్కర లేదు... కానీ సోనాక్షి సిన్హా మాత్రం ఈ విషయంలో అందరికన్నా కాస్త వేరు. విలేకరులు అడిగిందే తడవుగా అకిరా పోస్టర్ లో ఫీట్ ని ని కళ్ల ముందు చూపించేసింది.... ఇంతకీ సోనాక్షి చేసిన ఫీట్ ఏమిటీ ఆమె ఎందుకలా చేసిందీ... వివరాలు స్లైడ్ షోలో....

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తాజా ‘అకీరా'. 2011లో తమిళంలో వచ్చిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా అకీరా తెరకెక్కుతోంది. ఎ.ఆర్ మురుగదాస్ దర్శకుడు. ఇందులో సోనాక్షితో పాటు శతృఘ్న సిన్హా, కొంకణా సెన్ శర్మ, ఊర్మిళా మహంతా, అమిత్ సాద్, అనురాగ్ కశ్యప్, మిథున్ చక్రవర్తి తదితరులు నటిస్తున్నారు.

మూవీపై

మూవీపై

దీంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. అంతేగాక దర్శకుడు మురుగదాస్ బాలీవుడ్‌లో ఇంతకుముందు గజిని, హలీడే వంటి సూపర్ హిట్లను అందించడం కూడా అకీరాపై అంచనాలను పెరిగేలా చేసింది.

రిలీజ్

రిలీజ్

సెప్టెంబర్ రెండున రిలీజ్ కానున్న ఈ సినిమాకోసం చాలా రకాల స్టంట్స్ నేర్చేసుకుంది సోనాక్షి. అకీరా మూవీకి పోస్టర్ గా వేసిన సోనాక్షి పోజ్ సూపర్ గా క్లిక్ అయింది.

బాలీవుడ్

బాలీవుడ్

బాలీవుడ్ లో లేడీ ఫైటర్లుగా మారుతున్న అందాల తారల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే మల్ల యుద్ధ విన్యాసాలతో ‘సుల్తాన్'లో అనుష్క శర్మ అందరినీ ఆకట్టుకుంది.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

తాజాగా బాలీవుడ్ కే చెందిన మరో స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా "అకిరా" కోసం లేడీ ఫైటర్ అవతారం ఎత్తింది. మేల్ హీరోలే చేయగలిగిన అద్బుతమైన స్టంట్లని ఎంతో శ్రమపడి మరీ చేసింది.

చిత్ర యూనిట్

చిత్ర యూనిట్

చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి వినూత్న ప్రచారాలు చేస్తోండగా, గ్లామరస్ బ్యూటీ సోనాక్షి కూడా తన సినిమాకు హైప్ వచ్చేందుకు కొత్త ప్లాన్స్ అమలు చేస్తోంది.

సోనాక్షి

సోనాక్షి

ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హా చాలా హార్డ్ వర్క్ చేసింది. తొలి సారి ఈ అమ్మడు అకీరా సినిమాతో గాయకురాలిగా మారింది. రాజ్ రాజ్ కే అనే పవర్ ప్యాక్డ్ సాంగ్ ని సోనాక్షి ఆలపించగా, ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఎప్పుడు కనిపించని

ఎప్పుడు కనిపించని

గతంలో ఎప్పుడు కనిపించని విధంగా చాలా కొత్తగా ఈ చిత్రంలో కనపడనుంది ఈ బాలీవుడ్ భామ. ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్స్ లో సోనాక్షి గెటప్ ని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంక సినిమాలో ఈ అమ్మడి పర్ ఫార్మెన్స్ ఎక్సట్రార్డినరీగా ఉంటుందని యూనిట్ చెబుతోంది.

ఎడమ కాలు

ఎడమ కాలు

ఎడమ కాలు నేల పై ఉంచి.. కుడి కాలును దాదాపు పారలల్ గా చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ ఇక్కడున్నది సోనాక్షి అన్నది అసలు పాయింట్. టార్గెట్ కోసం ఏమైనా.. ఎత కష్టపడేందుకైనా వెనకాడదు సోనాక్షి.

అకీరా మూవీలో

అకీరా మూవీలో

అకీరా మూవీలో ఓ సాంగ్ రిలీజ్ కోసం వయ్యారంగా వచ్చేసింది సోనాక్షి సిన్హా. ఇక్కడ ఆమెకు పోస్టర్ మాదిరిగా షాట్ చేసి చూపించాలనే ఆబ్లిగేషన్ ఎదురైంది. దీనికి కాలు ఎత్త మరీ ఫోటోల ఉన్న పోజ్ ను తను లైవ్ లో చేసి చూపించేసి అందర్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది.

అకీరా

అకీరా

‘అకీరా'లో నటించేందుకు సోనాక్షి భారీ కసరత్తే చేసిందట. యాక్షన్ మూవీ కాబట్టి ఫిట్‌గా ఉండేందుకు 120 రోజులు ఫైటింగ్‌లో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుందట. ఈ సినిమాలో ఆమె నటించినట్లు బాలీవుడ్‌లో మరెవ్వరూ చేయలేదని మురుగదాస్ తెగ పొగిడేస్తున్నాడు.

English summary
Sonakshi Sinha strikes a pose at Akira song launch at MMK College, Mumbai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu