»   » పూరి జగన్నాధ్ చిత్రంలో చేయటమే అదృష్టం అంటోంది

పూరి జగన్నాధ్ చిత్రంలో చేయటమే అదృష్టం అంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో వియన్ ఆదిత్య దర్శకత్వంలో సరసన 'రెయన్ బో' చిత్రంలో మెరిసిన సోనాల్ చౌహాన్ గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు తన ప్రభావాన్ని చూపించలేకపోయిన ఆమె త్వరలో రానున్న 'బుడ్డా' చిత్రం తన దశని మార్చేస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సోనాల్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించబోతోంది. 'బుడ్డా'లో తనని జగన్నాథ్ తీసుకోక ముందే ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకున్నానని ఆమె అంటోంది. "ఈ సినిమాతో అది సాధ్యపడింది.జగన్ ఆఫీస్ నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేశా. ఇందులో నేను స్వతంత్రంగా ఆలోచించే మోడరన్ కాలేజ్ స్టూడెంట్ పాత్ర చేస్తున్నా. అంతకంటే ఎక్కువగా నా పాత్ర గురించి చెప్పలేను. ఇప్పటివరకు నా కెరీర్ ఎలా సాగిందన్నది అనవసరం. 'బుడ్డా'తో కచ్చితంగా పేరు వస్తుందని నమ్ముతున్నా. అమితాబ్‌తో ఇది నా రెండో సినిమా. ఆయన్ని చూసిన ప్రతిసారీ ఎందుకో నా నోట్లోంచి మాటలు రావు. కలిసినప్పుడల్లా ఆయనతో ఏదో చెప్పాలనుకుంటా కానీ ఆయన ఎదురు పడేసరికి మూగదానిలా అయిపోతుంటా. 'బుడ్డా' ఓపెనింగ్‌కి అభిషేక్, ఐశ్వర్య రావడంతో చాలా ఆనందించా. అభిషేక్‌కి వేరే షూటింగ్ ఉండటంతో వెంటనే వెళ్లిపోయాడు. ఐశ్వర్య గంటన్నర సేపుంది. ఆమెతో కాసేపు మాట్లాడే అవకాశం దొరికింది. ఆ కొద్దిసేపే ఆమె నుంచి చాలా నేర్చుకున్నా'' అని చెప్పుకొచ్చింది.

English summary
Sonal Chauhan has chanced upon an opportunity to feature with Amitabh Bachchan,Hema Malini and Raveena Tandon in Puri Jagannath film Buddha. The script reportedly calls for three generations of heroines for Bachchans character. All the three ladies have been sworn to secrecy, which explains why Sonal Chauhan refused to make any comment, when contacted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu