»   » బాలకృష్ణ సరసన ఆమే ఫైనల్(అఫీషియల్)

బాలకృష్ణ సరసన ఆమే ఫైనల్(అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, వారాహి చలనచిత్రం సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇద్దరుహీరోలకు చోటుంది. బాలకృష్ణ సరసన నటించే నాయికల కోసం పలువురు పేర్లు పరిశీలించారు. ఓ హీరోయిన్ గా బాలీవుడ్‌ భామ సోనాల్‌ చౌహాన్‌ ఎంపికైనట్లు సమాచారం.

'జన్నత్‌', 'త్రీజీ', 'బుడ్డా హోగయా తేరా బాప్‌' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె 'రెయిన్‌బో' అనే చిత్రంలోనూ నటించింది. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి వుంది. ఈ నెల 13 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.


ఈ విషయాన్ని బోయపాటి శ్రీను ఖరారు చేసారు. ఈ చిత్రంలో ఓ కథానాయికగా బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్‌ని ఎంపిక చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చెప్పారు. బాలకృష్ణ అభిమానులు గుండె మీద చెయ్యేసుకుని చూసేవిధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్, సమర్పణ: సాయి కొర్రపాటి

English summary
Sonal Chauhan, who shot to fame with Bollywood film Jannat, will soon romance Nandamuri Balakrishna in his next. The Delhi-based actress, who was first seen in Himesh Reshammiya's album Aap Kaa Surroor, will be making her second appearance in Tollywood opposite in a Balakrishna's untitled film to be directed by Boyapati Srinu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu