»   » బాలయ్యతో మరోసారి ఆ బికినీ బ్యూటీ..

బాలయ్యతో మరోసారి ఆ బికినీ బ్యూటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా... లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం చిత్రాల దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాను బాలయ్య ఇప్పటి వరకు చేసిన చిత్రాలకంటే స్టైలిస్ గా, రిచ్ గా ఉండేలా డైరెక్టర్ శ్రీవాస్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ శ్రీవాస్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు యూరఫ్ వెళ్లి షూటింగ్ లొకేషన్స్ పరిశీలించి వచ్చారు. ఇప్పటి వరకు ఏ చిత్రం షూటింగ్ చేయనటువంటి లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్, టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించేందుకు శ్రీవాస్ ప్లాన్ చేస్తున్నారు.

Sonal Chauhan to romance Balakrishna again

ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ‘లెజెండ్' సినిమాలో బాలయ్యతో నటించిన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ఎంపికైంది. బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, అంజలి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తుండటంతో సినిమా పట్ల చాలా కేర్ తీసుకుని సినిమాని స్టైలిస్, గ్రాండ్ లెవల్ లో రూపొందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, సుప్రీత్, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ష్: రవి వర్మ, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్ఎస్.థమన్, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం.రత్నం, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, నిర్మాత: ఈరోస్ ఇంటర్నేషనల్, దర్శకత్వం-సహ నిర్మాణం: శ్రీవాస్.

English summary
Sonal Chauhan to romance Balakrishna again in upcoming movie Dictator.
Please Wait while comments are loading...