»   » సోనమ్ కపూర్ కు ప్రేమ కంటే 'అదే' ఇష్టమా?

సోనమ్ కపూర్ కు ప్రేమ కంటే 'అదే' ఇష్టమా?

Subscribe to Filmibeat Telugu

నిన్నటి మేటి బాలీవుడ్‌ హీరో అనిల్‌ కపూర్‌ కుమార్తె సోనమ్‌ కపూర్‌ ప్రస్తుతం 'ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌" (ప్రేమకథలంటె నాకు అసహ్యం) అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె ప్రేమలో పడిన విషయాన్ని, షూటింగ్ లు ఎగ్గొడుతున్న సంగతిని బాలీవుడ్ పత్రికలు బయట పెట్టాయి. కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా మేనల్లుడు 'పునీత్‌" దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమాలో నటించే హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం అది ఎఫైర్‌కు దారి తీయడం ఏ పరిశ్రమలోనైనా సర్వసాధారణం.

అయితే..అందుకు భిన్నంగా..ఈ చిత్ర దర్శకుడు పునీత్‌తో సోనమ్‌ కపూర్‌ ప్రేమలో పడిందని తెలుస్తోంది. అంతేకాదు..వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమాయణం కారణంగా షూటింగ్‌ సరిగ్గా నడవడం లేదని కూడా యూనిట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయ్‌! కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ఎఫైర్స్‌కు చోటివ్వకుండా ముందుకు సాగుతున్న సోనమ్‌కపూర్‌..దర్శకుడిగా పరిచయమవుతున్న వ్యక్తితో ప్రేమలో పడడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu