మహేష్ తో చేయాలని ఉందంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్

By Srikanya

హైదరాబాద్ : ' నా డ్రీం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది నా కోరిక. అతని లూక్స్ చాలా బాగుంటాయని' తన మనసులో మాటని బయటకి చెప్పేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ మాట్లాడుతూ ఇలా స్పందించింది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు సరసన సోనమ్ కపూర్ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా సోనమ్ కూడా తన మసులోని మాట చెప్పడం వల్ల తన కోరిక కూడా త్వరలోనే నిజమవుతుందని ఆశిద్దాం.

సోనమ్ కపూర్ రీసెంట్ గా 'రంఝానా', 'భాగ్ మిల్కా భాగ్' సినిమాలతో సూపర్ హిట్స్ సాథించి ఉషారుగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన ఈ భామ తనకి టాలీవుడ్ లో పనిచేయాలని ఉందని, తను 'రంఝాన' లో చేసిన లాంటి పూర్తి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు వస్తే చేస్తానని తెలిపింది. తనకి తెలుగు పరిశ్రమలో నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ తనకి మన భాష రాకపోవడం వల్లే ఇక్కడి సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలిపింది.

మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' తర్వాత 'ఆగడు' సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ను హీరోయిన్ గా తీసుకునే యోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయం ఆ నోట ఈనోట చేరి మీడియాలో సైతం ప్రచారం సాగడంతో సోనమ్ కపూర్ స్పందించింది. నేను మహేష్ బాబుతో చేస్తాననే విషయంలో నిజం లేదు అంటూ తన మైక్రో బ్లాగింగ్ ద్వారా తేల్చి చెప్పింది.

సోనమ్ మహేష్ సినిమా ఆఫర్ ను తిరస్కరించిందనే విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు ఆమె ఇలా స్పందించటంతో మళ్లీ మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చింది. 'ఆగడు' సినిమా వివరాల్లోకి వెళితే...దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X