»   » బాయ్ ఫ్రెండుతో సోనమ్ కపూర్ ఎంగేజ్మెంట్? ఎవరు అతగాడు?

బాయ్ ఫ్రెండుతో సోనమ్ కపూర్ ఎంగేజ్మెంట్? ఎవరు అతగాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ నటించిన 'నీరజ' చిత్రం ఈ ఏడాది జాతీయ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ అవార్డుల వేడుకలో సోనమ్ కపూర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఓ మళయాల నటి వద్ద తన బాయ్ ఫ్రెండ్ విషయం చెప్పడంతో.... ఈ విషయం కాస్త మీడియాకు లీకైంది.

జాతీయ అవార్డ్స్ ప్రధానోత్సవంలో మళయాల నటి సురభి లక్ష్మి కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు తనతో పాటు వచ్చిన తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాను ఈ సందర్భంగా సురభి లక్ష్మికి పరిచయం చేసింది సోనమ్.

సోనమ్ స్వీట్ హార్ట్

సోనమ్ స్వీట్ హార్ట్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురభి లక్ష్మి మాట్లాడుతూ... సోనమ్ చాలా మంచి అమ్మాయి. తన బెస్ట్ ఫ్రెండ్ కూడా కేరళకు చెందిన వ్యక్తే అని చెప్పింది. కేరళ రాష్ట్రంలో ఆమెకు మంచి అనుబంధం ఉందని ఆమె మాటలను బట్టి అర్థమయిందని తెలిపారు.

సోనమ్ బాయ్ ఫ్రెండ్

సోనమ్ బాయ్ ఫ్రెండ్

అవార్డు వేడుకకు సోనమ్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజా కూడా వచ్చారు. అతడిని నాకు పరిచయం చేసింది.... అని సురభి లక్ష్మి వెల్లడించారు.

ప్రియురాలితో కలిసి

ప్రియురాలితో కలిసి

ఆనంద్ ఆహుజా తన ప్రియురాలు సోనమ్ కపూర్ తో కలిసి 64వ అవార్డుల వేడుకకు హాజరవ్వడం ద్వారా ఇప్పటి వరకు రహస్యంగా తన ప్రేమాయణాన్ని కొనసాగించిన ఈ జంట.... ఈ అవార్డుల వేడుకలో అందరి ముందు ఓపెన్ అయిపోయారు.

వీరి లవ్ స్టోరీ ఇలా మొదలైంది

వీరి లవ్ స్టోరీ ఇలా మొదలైంది

అక్షయ్ కుమార్ రుస్తుం సినిమా సక్సెస్ సమయంలో ఇద్దరి మధ్య పరచయం ఏర్పడిందని, తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. అప్పటి నుండి పలు పార్టీలు, ఈ వెంట్లలో ఈ ప్రేమ జంట సందడి చేస్తోంది.

త్వరలో ఎంగేజ్మెంట్?

త్వరలో ఎంగేజ్మెంట్?

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, త్వరలో వీరి ఎంగేజ్మెంట్ జరుగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

English summary
Malayalam actress Surabhi Lakshmi reveals how Sonam Kapoor introduced Anand Ahuja as her 'boyfriend' when they met at the recenty held National Awards ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu