»   »  'సోనియా' పై సినిమాకు ఓ.కె!!!

'సోనియా' పై సినిమాకు ఓ.కె!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sonia Gandhi
కాంగ్రేస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చెయ్యటానికి ఆమె పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. ఈ చిత్రానికి రూపశిల్పి దర్శకుడు జగన్ మోహన్ ముద్రా . అందులో ఆమె స్టూడెంటుగా యూ.కె లో ఉన్నప్పుడు..భర్త దివంగత రాజీవ్ గాంధీతో జరిపిన ప్రేమ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో చోటు చేసుకుంటాయని దర్శకుడు చెపుతున్నారు. ఆయన సోనియాగాంధీని వ్యక్తిగతంగా కలసి చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆవిడ అతని రీసెర్చికి ముచ్చటపడి సినిమా చేసుకోమని పర్మిషన్ ఇచ్చిందిట. కాకపోతే వచ్చే ఎలెక్షన్స్ దాకా ఆగమందిట. దాంతో సినిమాని 2009 లో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారట.

ఇక ఈ సినిమాలో కథ అంతా ఆమె వైపు నుంచి నడిచేలా ప్లాన్ చేస్తున్నారుట. కథలో ప్రధానంగా ఆమె రాజీవ్ ని మొదటిసారి ఇంగ్లాండులో కలుసుకోవటం, తర్వాత జరిగిన పరిమాణాలు, వివాహానంతరం రాజీవ్ మరణం, ఆమె సాహసోపేతంగా కాంగ్రేస్ ని ముందుకు విజయవంతగా నడిపించటం వంటి అంశాలు ఉంటాయట. జగన్ మోహన్ ముద్రా ఇప్పటికే రియలిస్టిక్ సంఘటనలను సమర్ధవంతంగా తెరకెక్కించే దర్శకుడుగా లబ్ద ప్రతిష్ఠుడు. ఆయన గతంలో ఐశ్వర్యా రాయితో 'Provoked'అనే సినిమా చేసాడు. ఆ సినిమాలో గృహ హింసకు బలైన ఓ అమ్మాయి తెగించి తన భర్తను తుదముట్టిస్తుంది.

వాస్తవ సంఘటనతో రూపుదిద్దుకున్న ఆ సినిమా ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. అలాగే ఇప్పుడాయన "Shoot on Sight"అనే సినిమాను నసీరుద్దీన్ షా,ఓం పురి వంటి మహానటులతో రూపొందించారు. నమ్ముకున్న విలువలు కోసం చివరదాకా పోరాడే ముస్లిం కమాండర్ కథను రూపొందిచారు. ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్త ఫిలిం సర్కిల్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి సోనియాపై తీయబోయే ఈ చిత్రం కూడా సంచలనం సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తారాగణం ఎంపిక కూడా భారీ ఎత్తున చేయనున్నారని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X