»   » ముంబై వీధుల్లో బెగ్గర్ గా ప్రముఖ సింగర్ సోను నిగమ్ (వీడియో)

ముంబై వీధుల్లో బెగ్గర్ గా ప్రముఖ సింగర్ సోను నిగమ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ గురించి సంగీత ప్రియులకు సుపరిచితమే. ఆయన గొంతు వింటే చాలు సోను నిగమ్ అని ఎవరైనా గుర్తు పట్టేస్తారు. అయితే ప్రయోగాత్మకంగా చేపట్టిన ఓ కార్యక్రమంలో సోను నిగమ్ ముంబై వీధుల్లో బెగ్గర్ గా మారి పాటలు పాడుతూ కనిపించారు.

తనను ఎవరూ గుర్తు పట్టకుండా మారు వేశంలో ఉన్న ఆయన ముంబైలోని పలు ప్రాంతంలో తన గాన మాధుర్యాన్ని వినిపించారు. సోను నిగమ్ గొంతు విని ఎవరైనా గుర్తు పడతారని భావించారు. ఏ ఒక్కరూ కూడా ఆయన్ను గుర్తు పట్టక పోవడం గమనార్హం.

ఉరుకులు, పరుగుల జీవితం ఉండే ముంబై లాంటి మెట్రో సిటీల్లో మరొకరి గురించి పట్టించుకునే తీరిక ఉండదు. అందుకే సోను నిగమ్ ను దారిపోయే చాలా మంది పట్టించుకోలేదు. అయితే కొందరు మాత్రం ఆయన గాన మాధుర్యాన్ని కొంత సేపు ఆగి విన్నారు. కొందరు డబ్బులు ఇచ్చారు.

ఓ యువకుడు మాత్రం మారు వేషంలో ఉన్న తన వద్దకు వచ్చి తిన్నావా అని అడిగి రూ. 12 తన చేతిలో పెట్టి వెళ్లారని సోను నిగమ్ తెలిపారు. 'బీయింగ్ హ్యూమన్' అనే యూట్యూబ్ ఛానల్ తో కలిసి ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు సోను నిగమ్.

వీడిమో


ముంబై వీధుల్లో బెగ్గర్ అవతారంలో పాటలు పాడుతున్న సోను నిగమ్.

బీయింగ్ హ్యూమన్

బీయింగ్ హ్యూమన్


‘బీయింగ్ హ్యూమన్' అనే యూట్యూబ్ ఛానల్ తో కలిసి ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు సోను నిగమ్.

ఎవరూ గుర్తు పట్టలేదు

ఎవరూ గుర్తు పట్టలేదు


మారు వేషంలో ఉన్న సోను నిగమ్ ను ఎవరూ గుర్తు పట్టలేదు.

వాయిస్ కూడా

వాయిస్ కూడా


సోను నిగమ్ వాయిస్ వినైనా ఎవరైనా గుర్తు పడతారని భావించినా...అలాంటిదేమీ జరుగలేదు.

English summary
On the streets of Juhu in Mumbai, Singer Sonu Nigam took the garb of an old man in tatters to dole out some of his songs as part of a social experiment conducted by ‘Being Indian’, a popular Youtube channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu