»   » సోను నిగమ్‌కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు

సోను నిగమ్‌కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sonu Nigam
ముంబై: ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు సోను నిగమ్‌కు అండర్ వరల్డ్ మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అతను ముంబై పోలీసులను ఆశ్రియంచాడని, ముంబై అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా షకీల్ నుండి అతనికి బెదిరింపులు వచ్చాయని జాతీయ ఛానల్స్‌లో వార్తలు వచ్చాయి.

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ముంబర్స్ తనను ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి చేంజ్ కావాలని వార్నింగ్స్ ఇచ్చారని ఆయన పోలీసులకు తెలిపినట్లు సమాచారం. దీంతో అతని కంప్లైంట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు అతనికి సెక్యూటీ కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా...సోను నిగమ్‌కు ఫోన్ చేసింది ఎవరు? ఎక్కడి నుంచి చేసారు? నిజంగానే మాఫియా నుంచి వచ్చిన కాల్సా? లేక వారి పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడుతున్నారా? ఇలా పలు కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ వార్తలతో సోను నిగమ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

బాలీవుడ్ సినీ పరిశ్రమకు అండర్ వరల్డ్ మాఫియా నుంచి బెదిరింపులు రావడం ఇదేమీ కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది ప్రముఖులను పలు కారణాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. అండర్ వరల్డ్ డాన్లతో పరిశ్రమలోని కొందరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గతంలో తేలింది.

English summary
Singer-turned-actor Sonu Nigam has reportedly been threatened by the underworld. The singer has approached the police, alleging he has got threat calls from underworld don Chhota Shakeel, CNN IBN reported.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu