»   » చార్మితో అఫైర్ ఏమిటన్న సోనూ సూద్

చార్మితో అఫైర్ ఏమిటన్న సోనూ సూద్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పూరి జగన్నాథ్ ధర్శకత్వంలో వచ్చిన హిందీ మూవీ 'బుడ్డ హోగా తెర బాప్"లో కలిసి నటించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్, హీరోయిన్ ఛార్మికి మధ్య ఎఫైర్ ముదిరినట్లు వస్తున్న వార్తలను సోను ఖండించారు. అవన్నీ అర్థం పర్థం లేని పుకార్లే నని కొట్టి పారేశారు. నేను నా భార్యతో సంతోషంగా ఉన్నాను, నేను ఆమెను మోసం చేస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదన్నారు. ఇలాంటి ప్రచారం ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేనద వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తల వల్ల తన కెరీర్ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

  ఛార్మి, సోనుమసూద్ ఇద్దరూ పంజాబీలే కావడంతో మనసులు కలిశాయని, ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చి నయన తారతో పెళ్లికి సిద్దం అయినట్లు...సోను తన భార్యకు విడాకులు ఇచ్చి ఛార్మితో సెటల్ అవ్వాలనే యోచనలో ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

  ఈ వార్తలు సోను కుటుంబలో చిచ్చు రేపినట్లు తెలుస్తూంది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. పాపం గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎన్నడూ ఎదుర్కోని సూద్...తొలి అనుభవంతో షాక్ తిన్నట్టున్నాడు. ఇలాంటి రూమర్లకు అలవాటు పడిన ఛార్మి...షరా మామూలుగానే సోనూతో ఎఫైర్ వార్తలను లైట్ తీసుకోవడం గమనార్హం.

  English summary
  Sonu Sood, who was reportedly dating his co-star Charmya Kaur of Puri Jagannath's Bbuddah Hoga Tera Baap (BHTB), has denied the speculations. The actor says that he has not even met her once and reports on their alleged affairs are not true.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more