»   »  తెలుగు మూవీ విలన్ సోనూ సూద్ కుటుంబంలో విషాదం

తెలుగు మూవీ విలన్ సోనూ సూద్ కుటుంబంలో విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగులో అరుంధతి, దూకుడు లాంటి చిత్రాల్లో విలన్ గా నటించిన సోనూ సూద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి శక్తి సాగర్ సూద్(77) అనారోగ్యంతో శనివారం మరణించారు. పంజాబ్ లోని మోగలోని తన నివాసంలో శక్తి సాగర్ సూద్ తుది శ్వాస విడిచారు.

శక్తి సాగర్ సూదర్ గత కొన్నేళ్లుగా శ్వాస కోశ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం గుండె పోటు రావడంతో మరణించారు. కొన్ని రోజుల క్రితమే సోనూ సూద్ మూడేళ్ల చిన్నారి హార్ట్ సర్జరీ కోసం సహాయం చేసాడు. ఇంతలోనే ఆయన తండ్రి హార్ట్ ఎటాక్ తో మణించడం అభిమానులను కలిచి వేసింది.

Sonu Sood’s Father Passes Away

సోనూ సూద్ తన తండ్రితో మాట్లాడుతుండా... ఉన్నట్టుండి ఆయన కూలబడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు ఆయన అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ముంబైలో నివాసం ఉంటున్న సోనూ సూద్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా పంజాబ్ వెళ్లారు.

ఎనిమిదేళ్ల క్రితమే సోనూ సూద్ తన తల్లి సరోజ్ సూద్ ను కోల్పోయారు. ‘సోనూ సూద్ సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ... శక్తి సూద్ గత కొంత కాలంగా శ్వాసకోస సమస్యలతో బాధ పడుతున్నారని, అందుకే ఆయన సోనూ సూద్ తో కలిసి ముంబైకి వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిపారు. పంజాబ్ లో ఉండటానికే ఆయన ఇష్టపడేవారని, తరచూ సోనూ సూద్ ఇక్కడికి వచ్చి వెళ్లేవారని తెలిపారు. సోనూ సూద్ సిస్టర్స్ మోనికా, మాల్వికాలకు వివాహం అయింది. వారిలో ఒకరు పంజాబ్ లో ఉంటుండగా, మరొకరు విదేశాల్లో ఉంటున్నారు. తన ఇద్దరు సిస్టర్స్ వచ్చిన తర్వాత మంగళవారం అంత్య క్రియలు నిర్వహించనున్నారు.

English summary
Bollywood actor Sonu Sood’s father, Shakti Sagar Sood, 77, died on Sunday (February 7) at their residence in Moga, Punjab.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu