మణికర్ణిక: సోనూ సూద్ వీడియో లీక్.. ఖతర్నాక్ సీన్, కంగనా చెడగొట్టిందిగా?
'మణికర్ణిక' సినిమా విడుదల తర్వాత దర్శకుడు క్రిష్ మీడియా ముందుకు వచ్చి కంగనా రనౌత్ నిజస్వరూపం, తాను సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత కంగనా రనౌత్.. సదాశివరావు పాత్ర విషయంలో చరిత్రను వక్రీకరించే మార్పులు కోరిందని ఆయన తెలిపారు.
ఈ చిత్రంలో తొలుత సదాశివరావు పాత్రలో సోనూ సూద్ నటించారు. దాదాపు 100 నిమిషాల నిడివిగల సీన్లు అతడిపై ప్లాన్ చేశారు. అయితే కంగనా ఈ పాత్రను ఇంటర్వెల్ సమయంలోనే చంపేసి సగానికి సగం నిడివి తగ్గించాలని కోరింది. అలా చేస్తే చరిత్రను వక్రీకరించినట్లు అవుతుందని క్రిష్ అంగీకరించక పోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి.

సదాశివరావు పాత్ర
నిర్మాతల సపోర్టుతో పాలిటిక్స్ ప్లే చేసిన కంగనా... చివరకు క్రిష్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునేలా చేసింది. తర్వాత కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. తన పాత్ర నిడివి తగ్గిండంపై అసంతృప్తితో సోనూ సూద్ కూడా వైదొలగాడు. దీంతో ఆ పాత్రను మహ్మద్ జీషన్‌తో రీ షూట్ చేశారు.
లీకైన సోనూ సూద్ వీడియో
తాజాగా ‘మణికర్ణిక' సోనూ సూద్ పై చిత్రీకరించిన సదాశివరావు పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. లీకైన సీన్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆ పాత్రలో సోనూ సూద్ ఉంటే సినిమా మరింత బావుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కంగనా చెడగొట్టిందా?
లీకైన సీన్లు చూసిన వారి నుంచి.. కంగనా తన తప్పుడు నిర్ణయంతో సదాశివరావు పాత్రను చెడగొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోనూ సూద్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ముందు తన నటన తేలిపోతుందనే భయంతోనే ఆమె ఇలా చేసి ఉంటుందనే వాదన సైతం వినిపిస్తోంది.

గుర్రుగా ఉన్న క్రిష్
కేవలం 30 శాతం సినిమాలో మార్పులు చేసి.... తానే 70 శాతం సినిమాకు దర్శకత్వం వహించినట్లు చెప్పుకుంటున్న కంగనా మీద దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆగ్రహంగా ఉన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











