Just In
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 10 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 11 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇద్దరు హీరోయిన్లతో బ్యాంకాక్ చెక్కేయనున్న ప్రభాస్...!
ఇటీవల 'మిస్టర్ పెర్ ఫెక్ట్', డార్లింగ్ వంటి ఫ్యామిలీ డ్రామా సినిమా చేసిన ప్రభాస్, తాజాగా చేస్తున్న మాస్ సినిమా 'రెబల్'. 'కాంచన" తో హిట్ ఇచ్చిన రాఘవ లారెన్స్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యులు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. శ్రీ బాలాజీ సినీ మీడియ పతాకంపై ప్రముక నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రధాన తారాగణమంతా పాల్గొనే సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. హైదరాబాదు షెడ్యులు పూర్తయ్యాక యూనిట్ బ్యాంకాక్ వెళుతుంది. అక్కడ హీరో హీరోయిన్లు ప్రభాస్, తమన్నాలపై పాటలను చిత్రీకరిస్తారు.
రెబల్ పేరుకు తగ్గట్టుగా మాస్, యాక్షన్ అంశాలతో ప్రభాస్ స్టయిల్లో ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెబుతున్నారు. దేనికైనా సరే తెగించి పోరాడి విజయం సాధించే యువకుడి కథ ఇదని దర్శకుడు చెప్పాడు. ఆ ప్రయత్నంలో మృత్యువును సైతం ఎదిరిస్తాడని ఆయన అన్నారు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దీక్షా సేథ్ ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ షెడ్యూల్ ఏకధాటిగా చిత్రం పూర్తయ్యేవరకు హైదరాబాద్, బ్యాంకాక్, వైజాగ్‌ల్లో చేస్తాం. ప్రభాస్‌లాంటి మంచి హీరోతో మా బ్యానర్ లో ఓ సూపర్ డూపర్ హిట్ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న కోపరేషన్‌ని ఎప్పటికీ మరచిపోలేము. అలాగే లారెన్స్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా కంపల్సరీగా సూపర్ డూపర్ హిట్ తీయాలన్న పట్టుదలతో ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం నిర్మాతలుగా మాకు ఎంతో థ్రిల్ గా వుంది. ప్రభాస్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం అవుతుంది. టైటిల్ కి తగినట్లుగా చాలా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో రెబల్ రూపొందుతోంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు..