»   » సునీల్ శెట్టి కూతురు హాట్ బ్లడెడ్ అఫైర్..! (ఫోటో)

సునీల్ శెట్టి కూతురు హాట్ బ్లడెడ్ అఫైర్..! (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టి త్వరలో హీరోయిన్ గా వెండితెర తెరంగ్రేటం చేయబోతోంది. ఆమెకు జోడీగా సూరజ్ పంచోళి హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘హీరో' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మింస్తుండటం గమనార్హం. జియా ఖాన్ ప్రియుడైన సూరజ్ పంచోలి ఆ మధ్య ఆమె అనుమానాస్పద మృతిలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి నిఖిల్ అద్వాని దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ గయ్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ‘హీరో' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్ర పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 3న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో గోవింద, అనిత హాసనందిని, వినోద్ ఖన్నా, ఖాదర్ ఖాన్ నటిస్తున్నారు.

అథియా శెట్టి, సూరజ్ పంచోలి త్వరలో వెండి తెర తెరంగ్రేటం చేయబోతున్న నేపథ్యంలో ‘ఫిల్మ్ ఫేర్' మేగజైన్ కవర్ పేజీపై ది హాట్ బ్లడెడ్ అఫైర్ పేరుతో హాట్ ఫోజులు ఇచ్చారు.

Sooraj Pancholi and Athiya Shetty
English summary
The new Filmfare cover features Sooraj Pancholi and Athiya Shetty, the lead pair of Bollywood flick 'Hero' which happens to be Salman Khan's first production.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu