»   » మహేష్ గురించి ఐటం లేడీ సోఫీ చౌదరి ట్వీట్

మహేష్ గురించి ఐటం లేడీ సోఫీ చౌదరి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1' సినిమాలో బాలీవుడ్ సెక్సీ ఐటం గర్ల్ సోఫీ చౌదరి స్పెషల్ సాంగు చేయబోతోంది. ఇటీవలే ఆమెపై సాంగు చిత్రీకరణ జరిగింది. మహేష్ బాబు, సుకుమార్‌లతో కలిసి పని చేయడం గొప్పగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది సోఫీ చౌదరి.

'సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 1(నేనొక్కడినే) చిత్రం మహేష్ బాబుతో కలిసి షూటింగులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. టీం మొత్తం అద్భుతంగా ఉంది' అంటూ సోఫీ చౌదరి తన ట్విట్టర్లో వెల్లడించింది. ఈ సినిమాలో తన సాంగు హిట్టయితే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది.

దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో ఐటం భామలు యమ సెక్సీగా ప్రజెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆయన సినిమాల్లో ఏది ఉన్నా లేక పోయినా...ఐటం సాంగు మాత్రం కేక పుట్టించే రేంజిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా '1' సినిమాలో ఐటం సాంగు విషయం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Mahesh Babu

ఈచిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10 విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

<blockquote class="twitter-tweet blockquote"><p>Such an honour to shoot for Sukkumar sir's Telugu film "One:Nenokkadine" with superstar Mahesh Babu <a href="https://twitter.com/urstrulyMahesh">@urstrulymahesh</a> ! Entire team is awesm!</p>— SOPHIE CHOUDRY (@Sophie_Choudry) <a href="https://twitter.com/Sophie_Choudry/statuses/366838713004724225">August 12, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
"Such an honour to shoot for Sukkumar sir's Telugu film "One:Nenokkadine" with superstar Mahesh Babu urstrulymahesh ! Entire team is awesm!" Sophie Choudry tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu