»   » `సౌఖ్యం` ఫస్ట్ టీజ‌ర్‌, బాహుబలి స్పూఫ్ అదిరింది (వీడియో)

`సౌఖ్యం` ఫస్ట్ టీజ‌ర్‌, బాహుబలి స్పూఫ్ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ం సౌఖ్యం సినిమా ఫ‌స్ట్ టీజ‌ర్‌కు విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంద‌ని చిత్ర నిర్మాత వి.ఆనంద్ ప్ర‌సాద్ చెప్పారు. గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టించిన సినిమా `సౌఖ్యం`. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోంది. ఎ.ఎస్. ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `య‌జ్ఞం` త‌ర్వాత గోపీచంద్ హీరోగా ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో మంచి ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ``మా సంస్థ‌లో గోపీచంద్ న‌టించిన `లౌక్యం` మంచి విజ‌యాన్ని సాధించింది. అలాగే ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ న‌టించిన `య‌జ్ఞం` విశేషాద‌ర‌ణ పొందింది.

ఇప్పుడు మా ముగ్గురి క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తోందంటే అంఛ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే `సౌఖ్యం` చిత్రాన్ని తీర్చిదిద్దాం. శుక్రవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌కి విశేష స్పంద‌న వస్తోంది. చూసిన ప్రతి ఒక్క‌రూ డ్యామ్ ష్యూర్ హిట్ చిత్ర‌మ‌ని ప్ర‌శంసిస్తున్నారు. `లౌక్యం` చిత్రాన్ని మించిన క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ స‌బ్జెక్ట్ అని అనిపిస్తోంద‌ని కితాబిస్తున్నారు. సినిమా షూటింగ్ అంతా పూర్త‌యింది. ప్ర‌స్తుతం డీటీయ‌స్ ఫైన‌ల్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నెల 13న గోపీచంద్‌ సొంత ఊరు అయిన ఒంగోలులో భారీ స్థాయిలో ఆడియో వేడుక‌ను నిర్వ‌హిస్తాం. అనూప్ రూబెన్స్ చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌నిచ్చారు. పాట‌లు విన్న‌వారంద‌రూ నా మాట‌ల‌ను త‌ప్ప‌క అంగీక‌రిస్తారు. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ నెల 25న సినిమాను విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``కొన్ని ప‌దాల‌ను విన‌గానే పాజిటివ్ థాట్స్ వ‌స్తాయి. అలాంటి ప‌దాల్లో సౌఖ్యం ఒక‌టి. ఒక‌రి సౌఖ్యాన్ని మ‌రొక‌రు కాంక్షిస్తే ప్ర‌తిచోటా సుభిక్షంగా ఉంటుంది. మా సినిమాలో హీరో కూడా త‌న కుటుంబంతో పాటు స‌మాజ సౌఖ్యాన్ని గురించి కూడా ఆలోచించే ర‌కం. దాని వ‌ల్ల అత‌ని జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో మేం `సౌఖ్యం` చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఇటీవ‌ల హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను చిత్రీక‌రించాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌యింది. పాట‌లు, యాక్ష‌న్ ఎపిసోడ్లు, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు కూడా సినిమాకు హైలైట్ అవుతాయి. గోపీచంద్‌, రెజీనా పెయిర్ బావుంద‌ని ఇప్ప‌టికే అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. గోపీచంద్‌తో నేను చేసిన `య‌జ్ఞం` చిత్రాన్ని మ‌రిపించేలా ఈ సినిమా ఉంటుంది. శుక్ర‌వారం విడుద‌లైన టీజ‌ర్‌ను చూసిన వారంద‌రూ మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ విత్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో తీశామ‌ని చెబుతుంటే ఆనందంగా ఉంది `` అని అన్నారు.

గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ‌్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

English summary
Soukyam Teaser featuring Gopichand & Regina Cassandra. Music composed by Anup Rubens. Directed by AS Ravi Kumar Chowdhary, exclusively on Bhavya Creations andProduced by Anand Prasad.
Please Wait while comments are loading...