For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సచిన్ , ధోని తరువాత మరో లెజెండ్ బయోపిక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ క్రికెటర్

  |

  సినిమా ప్రపంచానికి రాజకీయాలకు అలాగే ఆటలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ మూడు దారులు వేరైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు సెలబ్రిటీలు ఆ రంగాల వైపు కూడా అడుగులు వేయొచ్చు. అయితే సెలబ్రెటీల బయోపిక్ అయితే ఈ రోజులలో సర్వసాధారణంగా మారిపోయింది. పొలిటికల్ స్పోర్ట్స్ రంగాలల్లో ఆరితేరిన వారి జీవిత కథలను వెండితెరపైకి తీసుకు వచ్చి భారీ స్థాయిలో విజయాలను అందుకున్నారు. వారి రియల్ లైఫ్ ఆసక్తికరంగా ఉంటే చాలు అదే తరహాలో స్క్రీన్ పై చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అడ్డుకుంటున్నారు కూడా.

  ఇక క్రికెట్ ఆటలో కూడా ఎంతగానో గుర్తింపును అందుకున్న లెజెండ్ బయోపిక్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదివరకే మిస్టర్ కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోని, లెజెండ్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ లకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవిత కథ కూడా వెండితెరపైకి రాబోతున్నారు క్లారిటీ ఇచ్చేశారు. ఒకప్పుడు టీమిండియాలో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంగూలీ చాలా మంది యువకులను ప్రోత్సహించాడు.

  Sourav Ganguly about his biopic and details

  హర్భజన్ సింగ్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ మరియు ధోనీ గంగూలీ కెప్టెన్సీలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆ ఆటగాళ్లు ఉన్నత స్థాయిలో గుర్తింపు అందుకున్నారు. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంగూలీ ఒకరిపై నమ్మకం ఉంచితే తప్పకుండా వారు క్రికెట్ ఆటలో సమర్థులుగా రానించే వారు. ఆ విధంగా వారికి నమ్మకం కూడా ఇచ్చేవారు.

  సౌరవ్ గంగూలీ తన ఆట తీరుతో కోట్లాది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో మంచి పనులు కూడా చేశాడు. క్రికెట్ ఆటలో అతడు కొన్ని సార్లు ఆవేశానికి లోనైనప్పటికీ కూడా వివాదం ఎలాంటిదైనా సరే చిటికెలో దానిని పరిష్కరించే వాడు. ఎంతో కష్టపడి ఇంటర్నేషనల్ లెవెల్ క్రికెటర్ గా గుర్తింపు అందుకున్నటువంటి సౌరవ్ గంగూలీ జీవితంలో ఎన్నో కీలక మలుపులు ఉన్నాయి. అతని జీవితం వెండితెరపైకి వస్తే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సచిన్ టెండూల్కర్ వంటి వారు ఇదివరకే వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న యువ క్రికెటర్లు కూడా సౌరవ్ గంగూలీని ఒక స్ఫూర్తి గా తీసుకుంటారు.

  Sourav Ganguly about his biopic and details

  ప్రస్తుత BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక సరికొత్త బాధ్యతతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక రాబోయే బయోపిక్ పై కూడా సౌరవ్ వివరణ ఇచ్చారు. "క్రికెట్ నా జీవితం, ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి అలాగే నా ఎదుగుదలను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఆరాధించాల్సిన ప్రయాణం. లూవ్ ఫిల్మ్స్ నా ప్రయాణంలో ఒక బయోపిక్‌ను రూపొందిస్తుంది.

  నా కథ బిగ్ స్క్రీన్ పై జీవం పోషిస్తుంది అని తెలియగానే థ్రిల్ అయ్యాను" అని గంగూలీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఇక ఈ బయోపిక్ లో గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంది. గంగూలీ బయోపిక్‌ను లువ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో లవ్ రంజన్ రూపొందించనున్నారు. త్వరలోనే నటీనటులు వివరాలతో పాటు దర్శకుడు ఎవరనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Sourav Ganguly about his biopic and details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X