మహేష్ బాబు, విజయ్ కంటే హై రేంజ్‌లో బన్నీ రికార్డు.. అందరి చూపు అతని వైపే..

రోజురోజుకు ఇండియన్ సినిమా రూపురేఖలు మారిపోతున్నాయి. బాహుబలి కంతరువాత ఎక్కువగా నార్త్ జనాలు మన హీరోలపై ఫోకస్ పెడుతూ వచ్చారు. కమర్షియల్ సినిమాలు పర్ఫెక్ట్ గా తెరకెక్కించడంలో మన దర్శకులు చాలా గ్రేట్ అని కితాబు అందుకుంటున్నారు. ఇక హీరోలకు కూడా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో గూగుల్, వికీపీడియాలో మన హీరోల పేర్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.

Recommended Video

Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu
నెంబర్ వన్ లో అల్లు అర్జున్

నెంబర్ వన్ లో అల్లు అర్జున్

బాహుబలి అనంతరం టాలీవుడ్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక మన హీరోల టాలెంట్స్ ఏమిటనేది కూడా ఒక్కొక్కటిగా బయటపడింది. దీంతో డబ్బింగ్ సినిమాలకు మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రతి సినిమా కూడా డబ్ అవుతోంది. ఇక 2020లో వికీపీడియాలో ఎక్కువమంది సెర్చ్ చేయబడిన సౌత్ హీరోల పేర్లతో అల్లు అర్జున్ టాప్ లో నిలిచాడు. 2.73 మిలియన్ల వ్యూవ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

రెండవ స్థానంలో విజయ్

రెండవ స్థానంలో విజయ్

ఆ తరువాత సౌత్ లో రెండవ స్థానంలో కోలీవుడ్ స్టార్ విజయ్ ఉన్నాడు. గత కొంతకాలంగా తన బాక్సాఫీస్ స్టామినాను పెంచుకుంటున్న విజయ్ వికీపీడియా ప్రొఫైల్ కు 2.67 మిలియన్ల వ్యూవ్స్ అందినట్లు సమాచారం. విజయ్ మాస్టర్ సినిమా కూడా గత ఏడాది అత్యధిక మంది గూగుల్ చేసిన సౌత్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

మహేష్ 3వ స్థానంలో...

మహేష్ 3వ స్థానంలో...

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. కరెక్ట్ సినిమా తగిలితే మహేష్ కూడా రజనీకాంత్ తరహాలో రెండు భాషల్లో చక్రం తిప్పగలడు. ఇక 2020లో మహేష్ బాబు వికీపీడియా ప్రొఫైల్ కు 2.57మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే.

పెరుగుతున్న విజయ్ దేవరకొండ క్రేజ్

పెరుగుతున్న విజయ్ దేవరకొండ క్రేజ్

టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతోంది. ఇంటర్నెట్ కు సంబంధించిన ఎలాంటి రికార్డుల్లో ఆయన రౌడీ స్టార్ పేరు రావడం కామన్ అయిపోయింది. ఇక 2020లో విజయ్ దేవరకొండ వికీపీడియా ప్రొఫైల్ కు 2.37మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.

5వ స్థానంలో రజనీకాంత్

5వ స్థానంలో రజనీకాంత్

కోలీవుడ్ స్టార్ తలైవా రజనీకాంత్ కూడా నేటితరం జనరేషన్ తో నిత్యం పోటీ పడుతూనే ఉంటారు. రజనీకాంత్ వికీపీడియా ప్రొఫైల్ కు 2.23మిలియన్ల వ్యూవ్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తలైవా అన్నత్తే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X