»   » బాలీవుడ్‌లో మన హీరోయిన్స్: ఎవరుహిట్? ఎవరు ఫట్?

బాలీవుడ్‌లో మన హీరోయిన్స్: ఎవరుహిట్? ఎవరు ఫట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌత్ లో చేస్తున్న హీరోయిన్స్ అందరి కలా ఒకటే...బాలీవుడ్ ని ఎప్పటికైనా దున్నేయటం. గతంలో శ్రీదేవి, జయప్రద,వైజయంతి మాల వంటి వారు ఇక్కడ నుంచి అక్కడికి ఇంపోర్ట్ అయ్యి నార్త్ ని ఏలారు. ఇప్పుడు అదే రూటులో అసిన్, తమన్నా, కాజల్, శ్రుతి హాసన్ వంటి వారు ప్రయాణం పెట్టుకున్నారు. కొందరు అక్కడ సెటిల్ అవుతుంటే మరికొందరు గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో మన హీరోయిన్స్ సత్తా పై స్పెషల్ స్టోరీ.

సౌత్ లాంగ్వేజెస్ లో ఎన్ని హిట్స్ వచ్చినా, ఎంత సంపాదించినా హీరోయిన్స్ కి బాలీవుడ్ మీదే ఆసక్తి. అక్కడ తమ ప్రతిభకు తగిన గౌరవం దొరుకుతుందని, నేషనల్ మార్కెట్లో తామెంటో ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతారు. అందుకు తగినట్లే వారు బాలీవుడ్ దర్శక, నిర్మాతల వేటలో ఉంటూంటారు. మరో ధైర్యం ఏమిటంటే అక్కడ సినిమా ఆడకపోతే ఇక్కడ సౌత్ లో ఎలాగూ సినిమాలు ఉండనే ఉంటాయి.

అలాగే మన ముద్దుగుమ్మలు ప్రస్తుతం అక్కడి వారికి గట్టిపోటీ కూడా ఇస్తుండటం విశేషం. సొంత ప్రాంతాల పరంగా చూస్తే వీరిలో ఉత్తరాది భామలు కూడా ఉన్నా... దక్షిణాదిన తెచ్చుకున్న గుర్తింపే పెట్టుబడిగా బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బొద్దే ముద్దు అన్న స్థాయి నుంచి ప్రస్తుతం బాలీవుడ్‌ను తలదన్నే అందచందాలను ప్రదర్శిస్తున్న నేటితరం దక్షిణాది తారలు మాత్రం క్రమంగా హిందీలోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

మన హీరోయిన్స్ బాలీవుడ్ లో ... ఎవరు హిట్...ఫట్ స్లైష్ షోలో

అసిన్

అసిన్

తెలుగులో అమ్మా నాన్న తమిళ అమ్మాయి అంటే పలకరించిన ఈ మళయాళ కుట్టి తమిళంలో 'గజిని' వంటి బ్లాక్‌బస్టర్‌లో నటించింది .అదే చిత్రం రీమేక్‌ ద్వారా హిందీలో అమీర్‌ఖాన్‌కు జంటగా కనిపించింది. ఈ చిత్రం అక్కడ రూ. వంద కోట్లు వసూలు చేయటంతో అమ్మడు హాట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. పూర్తిగా హిందీకే పరిమితమైంది. లండన్‌ డ్రీమ్స్‌, హౌస్‌ఫుల్‌-2, బోల్‌బచ్చన్‌, రెడీ వంటి చిత్రాల్లో నటించింది. రెడీ కూడా రూ. వంద కోట్ల జాబితాలో చేరడం విశేషం. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించిన కొత్త చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

త్రిష

త్రిష

ప్రస్తుతం తెలుగులోనూ ఆఫర్స్ లేని త్రిష ఆ మధ్యన కట్టా-మీటా అంటూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యి ఆమె ఆశలపై నీళ్లు జల్లింది. నిజానికి ఆమె అంతకు ముందు కెరీర్ ప్రారంభంలో హిందీ చిత్రంలో చేసింది కానీ అది వర్కవుట్ కాకే ఇటు దక్షిణాదికి వచ్చి క్లిక్ అయ్యింది. ఇప్పటికీ ఆమె దృష్టి బాలీవుడ్ పైనే ఉంది. అయితే అక్కడ నుంచి పిలుపులేమీ రావటం లేదు.

దీపికా పదుకోని

దీపికా పదుకోని

కన్నడలో మన్మధుడు చిత్రం ఫ్రీమేక్ గా వచ్చిన ఐశ్వర్య చిత్రంతో పరిచయమైన ఈ భామ తర్వాత షారూఖ్ సరసన ఓం శాంతి ఓం వంటి సూపర్ హిట్ చేసి తన కెరీర్ ని మొదలెట్టింది. తర్వాత వరసగా హిట్స్ కొడుతూ ఎప్పుడూ వెనతిరిగి చూసుకోలేదు. తాజాగా చెన్నై ఎక్సప్రెస్ తో ఆమె కెరీర్ మరో మెట్టు ఎక్కింది.

శృతిహాసన్‌

శృతిహాసన్‌

ముందుగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్‌ సినిమా 'లక్‌' ద్వారా. అయితే, ఆ సినిమా ఆమెకు లక్‌ తేలేదు. అది ఫ్లాప్‌ అవడంతో దక్షిణాది సినిమాపై దృష్టిపెట్టింది. ఇక్కడ కూడా మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. అయినా నిరాశచెందకుండా ముందుకుసాగింది. 'గబ్బర్‌సింగ్‌' హిట్‌తో మళ్లీ అందరి దృష్టి శృతిహాసన్‌పై పడింది. ఈనేపథ్యంలో ప్రభుదేవా ఆమెను తన తదుపరి చిత్రం ద్వారా బాలీవుడ్‌లో మళ్లీ ఎంట్రీ ఇప్పించడానికి ప్రయత్నించాడు. టిప్స్‌ మ్యూజిక్‌ ఇండిస్టీస్‌ అధినేత రమేష్‌ తురానీ తనయుడు గిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తూ, తాను రూపొందించే చిత్రంలో హీరోయిన్ గా శ్రుతిహాసన్‌ని తీసుకుంటున్నాడు. నువ్వు వస్తానంటే నే వద్దంటానా రీమేక్ గా వచ్చిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఎవరినీ మెప్పించలేకపోయింది.

తాప్సీ

తాప్సీ

తెలుగులో సాహసం తప్ప ఒక్క హిట్టు సినిమా పడకపోయినా,తన గ్లామర్ తో వరస ఆఫర్స్ అందుకుంటున్న ఈ భామ బాలీవుడ్ లో వెలగటానికి తాను సైతం అంటూ సిద్దమవుతోంది. ఈ క్యూట్‌గాళ్ ‘ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశిసించి అక్కడా సెటిల్ అవ్వాలనే చూస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ చేసింది. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమెను ఎంపికచేసారు కానీ ..ఫలితం లేకుండా పోయింది.

కాజల్

కాజల్

వెండితెరకు పరిచయమైంది హిందీ చిత్రాల ద్వారానే.. అయినా, ఈమెకి గుర్తింపు వచ్చింది మాత్రం దక్షిణాదినే. ఇక్కడ తమదైన ముద్రవేసి స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఈమె హిందీలో హవా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 2004లో వివేక్‌ ఒబెరాయ్‌- ఐశ్వర్యారాయ్‌ జంటగా ఓ చిత్రంలో ఐశ్వర్య స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించింది కాజల్‌ అగర్వాల్‌. ఆపై దక్షిణాదిలో ప్రవేశించింది. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సూర్య 'సింగం'కు రీమేక్‌గా హిందీలో వచ్చిన చిత్రంలో అజయ్‌ దేవగన్‌కు జంటగా ఆమె నటించింది. ఫలితం సూపర్‌హిట్‌. ఈ ఉత్సాహంతో అమ్మడు కూడా హిందీ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తోంది.

తమన్నా...

తమన్నా...

ఈమె కూడా కాజల్‌ అగర్వాల్‌ను అనుసరిస్తోంది. కెరీర్‌లో తొలి చిత్రంగా ఓ హిందీ చిత్రంలో తమన్నా నటించింది. తర్వాత దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం హిందీపైనా కన్నేసింది. అజయ్‌దేవగన్‌ వంటి స్టార్‌ సరసన హిమ్మత్‌వాలాలో నటించింది. అయితే ఆ సినిమా ఊహించిన విధంగా హిట్ కాక ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. అంతా హిమ్మత్ వాలా ఒరిజనల్ లో చేసిన శ్రీదేవి తో పోల్చి చూసి విమర్శించటం మైనస్ గా మారింది.

ఇలియానా

ఇలియానా

అసిన్‌ బాటలో హిందీలోనూ పాగా వేసిన మరో దక్షిణాది తార ఇలియానా. తెలుగులో 'దేవదాసు'తో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... తర్వాత పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. హిందీలో తొలిసారిగా 'బర్ఫీ'లో నటించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో పాటు ఆస్కార్‌ అవార్డుకు మన దేశం నుంచి నామినేట్‌ అయింది. దీంతో అమ్మడి పేరు అక్కడ మార్మోగుతోంది. ప్రస్తుతం ఆమె దృష్టంతా హిందీ చిత్రాలపైనే ఉంది. దక్షిణాది చిత్రాలేవీ అంగీకరించలేదు. ప్రస్తుతం షాహిద్‌కపూర్‌కు జంటగా నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

శ్రియ

శ్రియ


దక్షిణాదిలో ఒకప్పుడు అగ్రతారగా మంచి స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేసిన శ్రీయ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేక రేసులో వెనకబడిపోయింది. దక్షిణాదిలో దాదాపు అగ్రహీరోలందరితో నటించిందీ భామ. దక్షిణాదిలో కెరీర్ సాఫీగా సాగకపోవడంతో ఈ సుందరి హిందీ చిత్రసీమపై దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే సంజయ్‌దత్ నటిస్తున్న ‘జిల్లా గజియాబాద్' చిత్రంలో ఓ ఐటమ్‌సాంగ్‌లో నర్తించింది శ్రీయ. కానీ సినిమా ఫ్లాప్. గతంలో ఈ సుందరి ‘తుజే మేరీ కసమ్' ‘మిషన్ ఇస్తాంబుల్' ‘గలీ గలీ చోరీహై' హిందీ చిత్రాల్లో నటించింది.

ఛార్మీ

ఛార్మీ

రీసెంట్ గా ప్రేమ ఒక మైకం అనే డిజాస్టర్ చిత్రంలో చేసిన ఛార్మి కి బాలీవుడ్ ప్రయత్నాలు కూడా పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. వేషాలు లేక బరువెక్కిన ఛార్మింగ్ ఛార్మి...బాలీవుడ్ లో పూరీ జగన్నాధ్ అండతో 'బుడ్డ హోగా తెర బాప్ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం ఓకే అనిపించుకున్నాక ఆమెకు ‘జిల్లా గజియాబాద్'లో చేసింది. అది ఫెయిల్యూర్ అయ్యింది. దాంతో ఆమె డైలమాలో బాలీవుడ్ స్టార్స్ కలుస్తూ ఉంది.

English summary
Compared to actors, many actresses from South have made their way to Bollywood. Earlier in the 70s and 80s, popular South actresses like Sridevi, Jayapradha and Vyjayanthimala achieved a successful transition in Bollywood. The same trend was back in late 2000, where few South Indian actresses Asin, Bhumika Chawla and many others made their way to Bollywood. Few of them got recognised and were flooded with movie offers in Bollywood, while few others like Trisha Krishnan and Tamanna, just made a blink and miss appearance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu