twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా మీద ఆధారపడి బతికే వ్యక్తులు.. మాపై సెటైర్లా? మార్చి2 నుంచి సినిమాలు బంద్

    By Rajababu
    |

    మార్చి 2 నుంచి దక్షిణాది సినీ పరిశ్రమ మూతపడుతున్నది. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (డిఎస్‌పి) అధిక‌మొత్తంలో ధ‌ర‌ల వాత వేయ‌డం నిర్మాత‌లు, పంపిణీదారుల‌కు పెద్ద మొత్తంలో భారం త‌ప్ప‌డం లేద‌న్న‌ది వాద‌న‌.. డిఎస్‌పీలు థియేట‌ర్ల‌ను గుప్పిట్లో పెట్టుకుని కాంట్రాక్టుల పేరుతో భారీ మొత్తాల్ని గుంజుతున్నార‌న్న అభియోగంతో బంద్‌న‌కు జేగంట మోగింది. ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ థియేట‌ర్ల‌ల‌లో మార్చి 2 నుంచి సినిమాలు నిలిపి వేత‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

     చర్చలు విఫలం

    చర్చలు విఫలం

    ప‌లుమార్లు డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొడైడ‌ర్ల యాజ‌మాన్య‌ల‌తో ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చ ర్చ‌లు జ‌రిపినా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో సమ‌ర‌శంఖం పూరించారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ డిజిట‌ల్ క‌మిటీ చైర్మ‌న్ దామోదర్ ప్ర‌సాద్, సెక్ర‌ట‌రీ ముత్యాల‌ రామ‌దాసు పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.

    భయంకరంగా చార్జీలు

    భయంకరంగా చార్జీలు

    తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామర్స్ సెక్ర‌ట‌రీ ముత్యాల‌ రామ‌దాసు మాట్లాడుతూ, `మార్చి 2 నుంచి థియేట‌ర్ల‌ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేస్తున్నాం. రెండు నెల‌ల నుంచి డిజిట‌ల్ ధ‌ర‌లు భ‌యంక‌రంగా పెంచేశారు.

    యాక్షన్ కమిటీ ఏర్పాటు

    యాక్షన్ కమిటీ ఏర్పాటు

    ఈ సమస్య నేప‌థ్యంలో జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఒక‌రి ఏర్పాటు చేశాం. క‌మిటీ చైర్మ‌న్ గా డి.సురేష్ బాబు గారిని, క‌న్వీన‌ర్ గా పి. కిర‌ణ్ గారు బాధ్య‌త‌లు తీసుకున్నారు.

     పోరాటం చేసినా ప్రయోజనం లేదు

    పోరాటం చేసినా ప్రయోజనం లేదు

    గతఆరు సంవ‌త్స‌రాల నుంచి సురేష్ బాబు, సి.క‌ల్యాణ్, ఎన్. వి ప్ర‌సాద్ గారు అంతా క‌లిసి పోరాటం చేసినా డిజిట‌ల్ యాజ‌మాన్యాలు దిగిరాలేదు. చివ‌రికి స‌మావేశాల‌కు గౌర్హ‌జ‌ర‌య్యేవారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే జాయింట్ యాక్ష‌న్ కమిటీ (సౌత్ లో ఫిల్మ్ ఇండ‌స్ర్టీ అన్ని) ఏర్పాటు చేశాం. దాని ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్, చైన్నై, బెంగుళూరులో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల యాజ‌మ‌న్యాలతో ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపాం. అవి విఫ‌ల‌మ‌య్యాయి.

    రాష్ట్ర ప్రభుత్వం అండగా

    రాష్ట్ర ప్రభుత్వం అండగా

    సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యను తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం. ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించారు. ప్ర‌భుత్వం త‌రుపున ఎల్ల‌వేళ‌లా స‌హ‌కారం ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

     తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మద్దతు

    తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మద్దతు

    మా పోరాటానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాలు పూర్తిగా మ‌ద్ద‌తునిచ్చాయి. నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, పంపిణీ దారులు అంతా ఒకే తాటిపైకి వ‌చ్చి పోరాటం చేయ‌డానికి సిద్ద‌మ‌య్యాం. ధియేట‌ర్ల నిలిపివేత అన్న‌ది ఎన్ని రోజులు కొన‌సాగుతుందో చెప్ప‌లేం. మా పోరాటినికి ప్రేక్ష‌కుల‌కు కూడా స‌హ‌క‌రిస్తార‌ని కోరుకుంటున్నాం` అని ముత్యాల రామదాసు అన్నారు.

    మూడు అంశాలపై డిమాండ్లు

    మూడు అంశాలపై డిమాండ్లు

    తెలుగు ఫిల్మ్ ఛాంబార్ ఆఫ‌ర్ కామ‌ర్స్ డిజిట‌ల్ క‌మిటీ చైర్మ‌న్ దామోదర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, `ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన స‌మావేశాల్లో ప్ర‌ధానం మూడు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. 1.వి.పి.ఎఫ్ ఛార్సెస్ క‌ట్టేది లేద‌ని.. 2. రెండు సినిమా యాడ్లు మాకివ్వాల‌ని, 3. క‌మ‌ర్శియ‌ల్ యాడ్లు 8 నిమిషాల నిడి కంటే ఎక్కువ ఉండ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల‌ను వాళ్ల ముందుంచాం.

    వ్యంగ్యంగా మాట్లాడుతారా?

    వ్యంగ్యంగా మాట్లాడుతారా?

    వ‌ర‌ల్డ్ వైడ్ వి.పిఎస్ ఛార్జెస్ 5 ఏళ్లు మాత్ర‌మే అనుకున్నాం. త‌ర్వాత పూర్తిగా నిషేధించాలని ముందుగా అనుకున్నాం. కానీ ఇప్ప‌టికి అదే విధానం కొన‌సాగుతుంది. దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌ల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. క్యూబ్ కు సంబంధింన ఓ వ్య‌క్తి అయితే చివ‌రి స‌మావేశంలో `ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ అంటూ వ్యంగ్యంగా మాట్లాడి అంత మంది పెద్ద‌ల ముందే లేచి వెళ్లిపోయాడు.

    వాళ్లకు సంస్కారం లేదు

    వాళ్లకు సంస్కారం లేదు

    మా సినిమా ఇండ‌స్ట్రీ మీద ఆధార‌ప‌డి బ్ర‌తికే వ్య‌క్తే అలా మాట్లాడడం ఎంతవ‌ర‌కూ సంస్క‌ార‌మో? అత‌నికే తెలియాలి. ఇక ఉపేక్షించేది లేదు. ద‌క్షిణాది అన్ని చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి పూర్తిగా మ‌ద్దుతు ల‌భించింది. మార్చి 2 నుంచి సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లను నిలిపివేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నాం. కావునా ప్రేక్ష‌కులు అంతా స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.

    English summary
    In a collective protest, all the four film industries from the South are staging a strike against the charges collected by Digital Service Providers. The members of councils from all four industries have decided to not release any new films in theatres from March 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X