»   » న్యూ ఇయర్ : నాని, సునీల్, కార్తీ, మంచులక్ష్మి ప్లాన్స్!

న్యూ ఇయర్ : నాని, సునీల్, కార్తీ, మంచులక్ష్మి ప్లాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా పలువురు సౌతిండియా స్టార్స్......పలు చోట్ల పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమైతే, మరికొందరు స్టార్స్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. మరికొందరు స్టార్స్ తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు, కొందరేమో విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.

సౌతిండియా స్టార్స్ అజిత్ కుమార్, నాని, కార్తి, శివకుమార్, సమంత, లక్ష్మి మంచు, హన్సిక, ప్రియమణి, అమలా పాల్, సెనీల్ తదితరులు వివిధ రకాలుగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం....

ఆస్ట్రేలియాలో ఫ్యామిలీతో అజిత్

ఆస్ట్రేలియాలో ఫ్యామిలీతో అజిత్

తను నటిస్తున్న తమిళ మూవీ ‘వీరమ్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్....ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడే న్యూఇయర్ వేడుక జరుపుకుంటారు. తిరిగి ఆయన జనవరి 9న ఇండియా తిరిగి వస్తారు. ఆయన నటించిన వీరమ్ చిత్రం జనవరి 10న విడుదలవుతోంది.

 ఇటలీలో అమలాపాల్

ఇటలీలో అమలాపాల్

తను నటిస్తున్న తమిళ మూవీ Nimirnthu Nil చిత్రం పూర్తి చేసుకున్న అమలా పాల్...తన ఫ్యామిలీతో కలిసి హాలీడే గడిపేందుకు ఇటలీ వెళ్లింది. క్రిస్‌మస్ సెలబ్రేషన్స్ అక్కడే జరుపుకుంది. పారిస్‌లో న్యూఇయర్ వేడుక జరుపుకుని...అటు నుండి అటే వాటికన్ సిటీని సందర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

అమెరికాలో నాని

అమెరికాలో నాని

హీరో నాని న్యూఇయర్ వేడుకలు అమెరికాలో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. తన భార్య అంజనాతో కలిసి అమెరికాలో ఉంటున్న తన సిస్టర్ ఇంటికి వెళ్లారు.

న్యూయార్కులో హన్సిక

న్యూయార్కులో హన్సిక

ప్రస్తుతం హన్సిక న్యూయార్కులో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. ఇక్కడే తన స్నేహితులతో కలిసి న్యూఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోనుంది.

కెనడాలో కార్తి

కెనడాలో కార్తి

తమిళ హీరో కార్తి తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజాతో కలిసి కెనడా వెళ్లారు. అక్కడ యువన్ శంకర్ రాజా తన పెర్పార్మెన్స్ ఇవ్వబోతున్నారు. యువన్ పెర్పార్మెన్స్ చూస్తూ న్యూఇయర్ ఎంజయ్ చేస్తానని కార్తి అంటున్నారు.

అమెరికాలో మంచు లక్ష్మి

అమెరికాలో మంచు లక్ష్మి

నిర్మాత, నటి మంచు లక్ష్మి న్యూఇయర్ వేడుకలు తన భర్త ఆండీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికా వెళ్లింది. ఓ వారం రోజులు పాటు ఆమె అక్కడే గడపనుంది.

బ్యాంకాక్‌లో ప్రియమణి

బ్యాంకాక్‌లో ప్రియమణి

ప్రియమణి ప్రస్తుతం బ్యాంకాక్‌లో గడుపుతోంది. అక్కడ టైగర్ పార్కులో విహరిస్తోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకోనుంది ప్రియమణి.

సూర్యతో కలిసి సమంత

సూర్యతో కలిసి సమంత

హీరోయిన్ సమంత సినిమా షూటింగుల్లో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. సినిమా సెట్లోనే వీరు న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు.

 ఫ్యామిలీతో సునీల్

ఫ్యామిలీతో సునీల్

హీరో సునీల్ న్యూఇయర్ సందర్భంగా తన సొంతూరు భీమవరం చేరుకుని ఫ్యామిలీ మెంబర్స్‌తో న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు.

ధన్య బాలకృష్ణ

ధన్య బాలకృష్ణ

సెకండ్ హాండ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ధన్య బాలకృష్ణ బెంగులూరులో తన ప్యామిలీ మెంబర్స్‌తో కలిసి న్యూఇయర్ వేడుక జరుపుకోనుంది.

 ఏస్తర్

ఏస్తర్

హీరోయిన్ ఏస్తర్ మంగులూరులోని తన ఇంట్లో ఫ్యామిలీతో కలిసి న్యూఇయర్ వేడుక జరుపుకోనుంది.

English summary
From holidaying in Italy to a reunion with their beloved in the US, southern stars have set their itinerary for the New Year and they are all set to ring it in with family and friends. For some, however, it will be work over play. Ajith Kumar, Nani, Karthi Sivakumar, Samantha, Lakshmi Manchu, Hansika Motwani, Priyamani and Amala Paul have planned to celebrate this new year in various foreign countries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu