»   » మెరిసిన సినీ తారలు సైమా-2013 అవార్డ్స్(ఫోటోలు)

మెరిసిన సినీ తారలు సైమా-2013 అవార్డ్స్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: షార్జా(యూఏఈ) వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)-2013 వేడుక మొదలైంది. సెప్టెంబర్ 12న మొదలైన ఈ వేడుక 13 తేదీన ముగియనుంది. ఈ వేడుకకు సౌతిండియాకు చెందిన సినీ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు.

రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకను శ్రీయ, సోను సూద్, ఆర్య, రానా దగ్గుబాటి తదితరులు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎవరెవరు పోటీపడుతున్నారు అనే విషయమై ఇప్పటికే నామినేషన్స్ లిస్ట్‌కూడా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రోజు విన్నర్స్ వివరాలు తెలియనున్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీయ మాట్లాడుతూ ' ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న SIIMA వేడుకలో నేను కూడా భాగమవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. సౌతిండియా సినిమాలతోనే నా కెరీక్ మొదలు పెట్టాను. అందుకే సౌత్ సినీ పరిశ్రమంటే చెప్పలేనంత అభిమానం' అన్నారు.

నిన్న సాయంత్రం జరిగిన తొలి రోజు వేడుకలో తారలు రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసారు. రాణా దగ్గుబాటి, శ్రీయ, త్రిష, సుధీర్ బాబు, తమిళ హీరో శ్రీరామ్, ధనుష్, సంగీత దర్శకుడు హారిష్ జైరాజ్, మంచు లక్ష్మి, నవదీప్, ప్రియమణి, దేవిశ్రీ ప్రసాద్, నిధి సుబ్బయ్య, రాగిణి ద్వివేది, రెజీనా, నిత్యామీనన్, నందినీ రెడ్డి, సలోని, కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్, అమలా పాల్, శృతి హాసన్, ప్రణీత, చార్మి తదితరులు రెడ్ కార్పెట్‌పై సందడి చేసారు.

శృతి హాసన్

శృతి హాసన్

హీరోయిన్ శృతి హాసన్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)-2013 వేడుక తొలి రోజు రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఆమె హాట్ అండ్ సెక్సీ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

శ్రీయ

శ్రీయ

శ్రీయ లుక్ అదిరింది కదూ. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)-2013 వేడుకకు శ్రీయ వ్యాఖ్యతగా కూడా వ్యవహరిస్తోంది. ఈ వేడుకలో భాగం కావడంపై శ్రీయ చాలా ఆనందంగా ఉంది.

రాణా

రాణా

తెలుగు హీరో రాణా హాండ్సమ్ లుక్‌తో సైమా-2013 వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఈ వేడుకలో కూడా రాణా తన ఫ్రెండ్ త్రిషతో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం గమనార్హం. వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అమలా పాల్

అమలా పాల్

అమలా పాల్ లుక్ చాలా సెక్సీగా ఉందని ఆమె అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. రెడ్ కార్పెట్‌పై రెడ్ డ్రెస్సులో ఆమె మరింత అందంగా మెరిసిపోయిందని అంటున్నారంతా...

సుధీర్ బాబు

సుధీర్ బాబు

కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సుధీర్ బాబు. ఇటీవల ‘ప్రేమకథా చిత్రమ్'తో తొలి విజయం సొంతం చేసుకున్న సుధీర్ బాబు సైమా-2013 వేడుకలో చాలా సంతోషంగా కనిపించాడు.

త్రిష

త్రిష

త్రిష లుక్ అంత సెక్సీగా ఏమీ లేక పోయినా కాస్త వెరైటీగా ఉంది కదూ. ఎప్పుడూ వేసే సెక్సీ రోటీన్ డైస్సులు కాకుండా ఈ సారి ఇలా వెరైటీగా ట్రై చేసింది త్రిష్. ఆమె హెయిర్ స్టైల్ కూడా వెరైటీగానే ఉంది.

ధనుష్

ధనుష్

రంఝానా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సౌత్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ సైమా-2013 వేడుకలో ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఆయన లుక్ కూడా చాలా డిఫరెంటుగా ఉంది.

చార్మి

చార్మి

తన వీపు అందాలను బార్లా చూపిస్తూ....రెడ్ కార్పెట్‌పై ఒయ్యారంగా నడిచింది చార్మి. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సినిమా అవకాశాలు పెరగాలంటే ఇలాంటి పాట్లు తప్పవుమరి!

అల్లు శిరీష్

అల్లు శిరీష్

‘గౌరవం' చిత్రంతో హీరోగా పరిచయం అయిన అల్లు శిరీష్ త్వరలో ‘కొత్త జంట' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సైమా-2013 వేడుకలో ఇలా సూటు బూటుతో దర్శనం ఇచ్చాడు.

రెజీనా

రెజీనా

హీరోయిన్ రెజీనా తన సెక్సీ సెక్సీ ఆటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎరుపు రంగు డ్రెస్సులు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

విద్యుత్ జామ్‌వాల్

విద్యుత్ జామ్‌వాల్

బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్‌వాల్ ఇటీవల పలు సౌత్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. షార్జాలో జరుగుతున్న సైమా-2013 వేడుకలో ఇలా దర్శనం ఇచ్చాడు.

ప్రణీత

ప్రణీత

హీరోయిన్ ప్రణీత ఇప్పటికే పలు సౌత్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ రేంజికి ఇంకా చేరుకోలేదు. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతోనైనా అమ్మడు దశ తిరుగుతుందో? లేదో?

కొలవెరి పోరడు

కొలవెరి పోరడు

వై దిస్ కొలవెరి కొలవెరి అంటూ అప్పట్లో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపిన పాటకు కంపోజ్ చేసింది ఈ పోరగాడే అనిరుధ్. సైమా-2013 వేడుకలకు ఇలా టిప్ టాప్ గా హాజరయ్యాడు.

సలోని

సలోని

తెలుగులో నటించిన ‘మర్యాద రామన్న'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సలోని....పలు సౌత్ సినిమాల్లో నటించింది. సైమా అవార్డుల కార్యక్రమానికి ఇలా సెక్సీ డ్రెస్సింగుతో హాజరైంది.

శ్రీరామ్

శ్రీరామ్

తమిళ నటుడు శ్రీరామ్ కూడా సైమా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యాడు. శ్రీరామ్ పలు తెలుగు చిత్రాల్లోనూ నటించాడు.

నిత్యామీనన్, నందినీ రెడ్డి

నిత్యామీనన్, నందినీ రెడ్డి

అలా మొదలైంది...సినిమా పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ నిత్యా మీనన్, దర్శకురాలు నందినీ రెడ్డి. ఇద్దరూ కలిసి సైమా అవార్డుల కార్యక్రమంలో ఇలా రెడ్ కార్పెట్ పై సందడి చేసారు.

నవదీప్

నవదీప్

తెలుగు యువ హీరో నవదీప్ సైమా అవార్డుల కార్యక్రమానికి హాజయ్యాడు. నవదీప్‌తో పాటు మరికొందరు తెలుగు యువ హీరోలు కూడా ఈ వేడుకకు వచ్చారు.

కాజల్, నిషా

కాజల్, నిషా

సౌతిండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, తన చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలిసి హాజరైంది. ఈ ఇద్దరు స్టార్ సిస్టర్స్ రెడ్ కార్పెట్ పై నడిచి సందడి చేసారు.

హారిష్ జైరాజ్

హారిష్ జైరాజ్

సౌతిండియాకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుల్లో హారిష్ జైరాజ్ కూడా ఒకరు. ఆయన సైమా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

లక్ష్మీ ప్రసన్న

లక్ష్మీ ప్రసన్న

తెలుగు సినిమా నటి, నిర్మాత మంచు లక్ష్మి సైమా-2013 కార్యక్రమానికి హాజరై సందడి చేసింది. రెడ్ కార్పెట్‌పై వైట్ గౌనులో లక్ష్మి ప్రసన్న అందంగా మెరిసిపోయింది.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

సౌతిండియా స్టార్ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ దుబాయ్ లో జరిగిన సౌతిండియా ఇంటర్నేషనల్ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రియమణి

ప్రియమణి

సౌతిండియాలో అన్ని భాషాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన హీరోయిన్ ప్రియమణి సైమా అవార్డుల కార్యక్రమంలో ఇలా బ్లాక్ డ్రెస్సులో సెక్సీగా లుక్ తో ఆకట్టుకుంది.

నిది సుబ్బయ్య

నిది సుబ్బయ్య

ఒక తెలుగు సినిమా పరిశ్రమ హీరోయిన్లు మాత్రమే కాదు...తమిళ, కన్నడ, మళయాల హీరోయిన్లు కూడా సందడి సారు. వారిలో నిధి సుబ్బయ్య ఒకరు.

రాగిణి ద్వివేది

రాగిణి ద్వివేది

కన్నడ చిత్రాల హీరోయిన రాగిణి ద్వివేది సైమా-2013 వేడుకలో ఇలా బ్లూ కలర్ కాస్ట్యూమ్ లో ఆందరి చూపులను ఆకట్టుకుంది.

English summary
As Indian cinema is making a strong impact globally, it's time for South Indian Cinema Industries to claim its space in the realm of world cinema. South Indian Film Industries like Telugu, Tamil, Kannada and Malayalam will be occupying the centre stage at South Indian International Movie Awards (SIIMA).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu