twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SP Balasubrahmanyam పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

    |

    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఫర్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్‌ హస్పిటల్‌లో చేరారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించిందనే విషయంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లో ఏమున్నదంటే...

    Recommended Video

    SP Balasubrahmanyam : ICU కి తరలింపు, కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ఫ్యాన్స్ | Oneindia Telugu

    SP Balasubrahmanyam health condition critical, kept on life support

    హాస్పిటల్ వర్గాల సమాచారం ప్రకారం..

    హాస్పిటల్ వర్గాల సమాచారం ప్రకారం..

    చెన్నైలోని హెల్త్ కేర్ ఫర్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్‌ హస్పిటల్‌ రిలీజ్ చేసిన ప్రకారం.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన కోవిడ్ 19 పాజిటివ్‌తో హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నాం. రెండు రోజులుగా చికిత్స సరిగానే స్పందించారు. ఆయనకు సడెన్‌గా శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది అని వైద్యులు వెల్లడించారు.

     గురువారం రాత్రి నుంచి పరిస్థితి విషమం

    గురువారం రాత్రి నుంచి పరిస్థితి విషమం

    ఆగస్టు 13 తేది (గురువారం) అర్ధరాత్రి నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హస్పిటల్ మెడికల్ టీమ్ నిపుణుల బృందం సలహా, సూచనల మేరకు ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించాం. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు.

    ఐసీయూలో నిరంతర పర్యవేక్షణ

    ఐసీయూలో నిరంతర పర్యవేక్షణ

    అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఐసీయూలో హేమోడైనమిక్ అండ్ క్లినికల్ పారామీటర్స్ బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు అని విడుదల చేసిన తాజా బులెటిన్‌లో హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నారు.

     పలు భాషల్లో వేలాది పాటలు

    పలు భాషల్లో వేలాది పాటలు

    ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా గాయకుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 దశాబ్దాలపాటు పలు భాషల్లో వేలాది పాటలు పాడారు. తెలుగు బుల్లితెరపై పలు సంగీత నేపథ్యం ఉన్న షోలకు ఆయన హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి గొప్ప గాయకుడు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

    Read more about: sp balasubramanyam
    English summary
    SP Bala Subramanyam health condition critical, kept on life support
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X