మా నాన్న చనిపోతూ...: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ప్రముఖ రచయిత, నటుడు తణికెళ్ల భరిణి 'మిథునం'అనే ఓ ఫీచర్ ఫిల్మ్ ని డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరమణ 'మిథునం' కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా విడుదల అయిన ఈ చిత్రం పాటలు అందరినీ అలరిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''మిథునం' కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శ్రీరమణ గారికి అభినందనలు. తనికెళ్ల భరణి నాకు తెలిసిన వాడైనందుకు చాలా గర్వపడుతున్నాను. 'మిథునం' అచ్చమైన తెలుగు సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి... అందరూ ఆదరించాలి. ఈ రోజుల్లో ఒక మంచి సినిమా బైటికి రావాలంటే పురిటి నొప్పులు పడుతోంది. 'మిథునం' లాంటి మంచి సినిమాలకు ప్రభుత్వ పెద్దలు సహకరించాలి. ఓ మామూలు ఇంటిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ ఇంటిని ఈ చిత్రానికి గుర్తుగా ఉంచేస్తానని నిర్మాత చెప్పడం అభినందనీయం' అన్నారు.
'మిథునం' చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించానని చెప్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం మీడియా వారికి ప్రదర్శించారు. అందరూ ఈ చిత్రం బావుందని ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications












