»   » షారూఖ్ ఖాన్ కు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం

షారూఖ్ ఖాన్ కు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కు మన గాన గంధర్వుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం అందిస్తున్నారు. బాలీవుడ్‌ బాద్‌షా చిత్రాలకు బాలు ఇంతకుముందెన్నడూ గాత్ర దానం చేసిన దాఖలాలు లేవు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో షారూఖ్‌, దీపికా పదుకొణెలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను ప్రస్తుతం బాలు ఆలపించడం విశేషం.


షారూఖ్‌ భార్య గౌరి ఖాన్‌ నిర్మిస్తున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రానికి విశాల్‌-శేఖర్లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాల తరువాత షారూక్‌ఖాన్‌ చిత్రంలో పాట పాడమని సంగీత దర్శకులు కోరితే బాలు చాలా ఆశ్చర్యపోయారట.

అమితాభ్‌ భట్టాచార్య రాసిన ఈ పాట ఎంతో నచ్చడంతో పాడటానికి పచ్చజెండా వూపారట బాలు. ఈ పాటను కేవలం రెండు గంటల వ్యవధిలోనే రికార్డింగు పూర్తి చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడిదే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక గతంలో అందరినీ అలరించిన సల్మాన్‌ ఖాన్‌ 'మైనే ప్యార్‌ కియా'లో పాటలు పాడారు. హృద్యంగా అల్లిన ఈ ప్రేమ కథ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంలో ఇతివృత్తం కూడా ఒక కారణం. వినసొంపుగా ఉన్న దీనిలోని పాటలు ప్రపంచం మొత్తం మారుమోగిపోయాయి. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో ప్రసిద్ధ గాయకుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయి.

కమల్‌ హాసన్‌-రతి అగ్నిహోత్రిలు నటించిన 'ఏక్‌ దూజే కేలికే', 'హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌' వంటి చిత్రాల్లో నేపథ్య గానం చేసిన బాలూ బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితుడే. మైనే ప్యార్‌ కియా చిత్రం తరువాత సల్మాన్‌ ఖాన్‌ నటించిన మరికొన్ని చిత్రాలకు పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం.

English summary
Legendary singer-composer SP Balasubrahmanyam, who sang for Salman's early hits, returns with Chennai Express. SP Balasubrahmanyam, who will be always remembered by Hindi film followers as Salman Khan's romantic voice from his early days, is back in Bollywood after a hiatus of two decades. The 66-year-old singer-actor-composer-producer has sung the title track of Shah Rukh Khan's Chennai Express.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu