»   » ఎస్పీ బాలుకు లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా... ఏంటి గొడవ?

ఎస్పీ బాలుకు లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా... ఏంటి గొడవ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. అమెరికా టూర్‌లో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పర్మిషన్ లేకుండా తాను కంపోజ్ చేసిన పాటలు పాడుతున్నాడని, అలా చేయడానికి వీల్లేదంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ లీగల్ నోటీసులు అందిన విషయాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ధృవీకరించారు. తనతో పాటు సింగర్స్ చిత్ర, చరణ్‌తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లకు లీగల్ నోటీసులు అందాయని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

 ఆయన సమస్య ఏమిటో తెలియదంటున్న బాలు

ఆయన సమస్య ఏమిటో తెలియదంటున్న బాలు

ఎస్పీబీ50 పేరుతో తన కొడుకు ప్లాన్ చేసిన వల్డ్ టూర్ లో భాగంగా టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇండియాలోని పలు చోట్ల కూడా ప్రదర్శనలిచ్చినట్లు అపుడు తాను ఇళయరాజా పాటలు పాడినా ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదన్నారు ఎస్పీ బాలు.

అమెరికా టూర్లో ఉండగా నోటీసులు

అమెరికా టూర్లో ఉండగా నోటీసులు

గతంలో ఎలాంటి అభ్యంతరాలు తెలుపని ఇళయరాజా...ఇపుడు అమెరికా టూర్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇళయరాజా ఎందుకిలా స్పందించారో తెలియడం లేదని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫేస్ బుక్ ద్వారా తెలియజేసారు.

చట్టపరమైన అడ్డంకుల గురించి తెలియదు

చట్టపరమైన అడ్డంకుల గురించి తెలియదు

ఆయన పాటలు పాడితే చట్టపరమైన అడ్డంకులు ఉంటాయని తెలియదని, అందుకే తన ట్రూప్ ఇక ఇళయరాజా పాటలు పాడబోదని ఎస్పీబీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలియక చేసామని, ఇకపై అలా చేయబోమన్నారు.

 అలాంటి కామెంట్లు వద్ద

అలాంటి కామెంట్లు వద్ద

అదృష్ట వశాత్తు... ఆ భగవంతుడి కృప వల్ల ఇతర సంగీత దర్శకుల పాటలు ఎన్నో పాడానని, వాటినే ఈ ఈవెంట్‌లో పాడుతాను అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇళయారాజ పాటలు ఎందుకు పాడటం లేదనే ప్రశ్నలు రాకూడదనే ఈ పోస్టు పెట్టాను, నేను వెల్లడించిన ఈ విషయంపై ఎదుటివారిని నొప్పించే విధంగా ఎలాంటి కామెంట్లు పెట్టవద్దని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

English summary
In a shocking controversy versatile singer S P Balasubrahmanyam in his Facebook post claimed that he had received a legal notice from music director Ilayaraaja's attorney for singing the songs composed by 'Maestro' Ilayaraja at various concerts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu