»   » రవితేజ ఆశపడ్డాడు...కానీ అతనికి దక్కనీయలేదు!

రవితేజ ఆశపడ్డాడు...కానీ అతనికి దక్కనీయలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్‌‌లో అక్షయ్‌కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ‘స్పెషల్‌ 26' చిత్రాన్ని తెలుగులో రవితేజ రీమేక్ చేయాలనుకున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో రీమేక్ కావాల్సి ఉంది. రవితేజ ఆశ పడ్డాడు కానీ అతనికి అది దక్కకుండా దూరం అయింది. ఈ

చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో రీమేక్‌ చేసేందుకు తమిళ దర్శక నిర్మాత, నటుడు త్యాగరాజన్ హక్కులు పొందారు. తన కొడుకు, తమిళ హీరో ప్రశాంత్ హీరోగా ఈ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తారు త్యాగరాజన్. తన కొడుకును స్టార్ హీరోగా నిలబెట్టడానికి త్యాగరాజన్ చాలా కాలంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రశాంత్ మాత్రం అనుకున్నంత స్థాయికి ఎదగలేక పోతున్నాడు.

Special 26 south remake details

ఇపుడు ‘స్పెషల్ 26' చిత్రాన్ని రీమేక్ చేసిన తమిళం, తెలుగు, మలయాళంలో, కన్నడ బాషల్లో విడుదల చేస్తారట. ఈ చిత్రానికి తమిళంలో ‘ఇరుబదుఆరు' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, నాజర్, తంబిరామయ్య, అభిశరణ్య, రోబో శంకర్, జైఆనంద్, బీసెంట్ నగర్ రవి, దేవదర్శిని ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు.

వీరితో పాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఐటం సాంగులో నటించబోతోందట. త్వరిత గతిన సినిమా షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Prashanth to remake Special 26 in Tamil and Telugu.
Please Wait while comments are loading...