»   » బాలకృష్ణ కోసం స్పెషల్ డిజైన్డ్ టాటా సఫారీ

బాలకృష్ణ కోసం స్పెషల్ డిజైన్డ్ టాటా సఫారీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం టాటా సఫారీ వాహనాన్ని సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు. సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్‌కు తగిన విధంగా హుందాగా ఈ వాహనం డిజైన్ ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య నడిపే బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టె హీరోయిన్లు. జగపతి బాబు విలన్ పాత్రలో చేస్తున్నాడు. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. 'సింహా' తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా మ్యూజిక్‌పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు. ఈ చిత్రానికి 'లెజెండ్', 'జయసింహ' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అంతా మొదట అనుకున్నారు. కానీ పిబ్రవరికి వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ మార్చి ల లేదా ఏప్రియల్ లలో వచ్చేటట్లు ఉండటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయనుండటంతో ఈ చిత్రం కొంత వరకూ హెల్ప్ అవుతుందని ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

English summary
Tata Safari vehicle been readied for Balakrishna upcoming film, directed by Boyapati Srinu. This Safari will have minor changes, to make it look special.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu